మూడేళ్ల పాత ఫోన్.. ఐ20 కారులోనే ప్రయాణం!: ఎందుకంటే? | Tejasswi Prakash Shares Why She Prefers Her i20 Over Her Audi Q7 | Sakshi
Sakshi News home page

మూడేళ్ల పాత ఫోన్.. ఐ20 కారులోనే ప్రయాణం!: ఎందుకంటే?

Nov 16 2025 4:48 PM | Updated on Nov 16 2025 5:05 PM

Tejasswi Prakash Shares Why She Prefers Her i20 Over Her Audi Q7

నటిగా మాత్రమే చాలామందికి తెలిసిన తేజస్వి ప్రకాష్.. ఒక తెలివైన పెట్టుబడిదారు అని బహుశా కొంతమందికి మాత్రమే తెలుసు. ఈమె వద్ద ఆడి కారు ఉన్నప్పటికీ.. ఐ20 కారునే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు.. ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.

బిగ్‌బాస్ 15 విజేత అయిన తేజస్వి ప్రకాష్ నికర విలువ రూ. 25 కోట్లు అని 2024లో పింక్‌విల్లా ప్రచురించిన నివేదిక ద్వారా వెల్లడించింది. ఈమెకు భారతదేశంలోనే కాకుండా దుబాయ్‌లో కూడా కోట్ల విలువైన ఆస్తులను ఉన్నట్లు సమాచారం. అయితే ఈమె ఎప్పుడూ ఐ20 కారును ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు, దానికి కారణం కూడా చెప్పింది.

''నాకు నా ఆడి కారు ఇష్టం, కానీ నేను తరచుగా నా i20లో ప్రయాణిస్తాను. ఎందుకంటే అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆడి కారు పార్క్ చేయడానికి స్థలం అవసరం, కానీ i20 విషయంలో అలా కాదు'' అని తేజస్వి ప్రకాష్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆడి కారును ఉపయోగించేటప్పుడు ఏదైనా గీతలు పడితే.. దానికోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను i20ని తీసుకెళ్లడానికి ఇష్టపడతానని ఆమె వెల్లడించారు.

తేజస్వి ప్రకాష్.. ఏప్రిల్ 2022లో ఆడి క్యూ7 కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ. 90 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఉంది. అంతే కాకుండా తాను మూడేళ్లకు ముందు లాంచ్ అయిన ఐఫోన్ వారుందుతున్నట్లు చెప్పింది. ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ కొనాలనే ఆలోచన నాకు లేదని స్పష్టం చేసింది.

తేజస్వి ప్రకాష్ ఇన్వెస్ట్‌మెంట్స్
తేజస్వి ప్రకాశ్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అంతే కాకుండా జుహులో సామ్స్ సలోన్ అనే సెలూన్ ఉంది. ఎప్పుడూ డబ్బు సంపాదించే ఆస్తులలో పెట్టుబడి పెట్టాలని ఆమె చెబుతారు. "నేను ఒక ఆస్తిలో పెట్టుబడి పెడితే, ఇంట్లో కూర్చొని దాని నుంచి సంపాదించవచ్చని నాకు తెలుసు. నేను ప్రస్తుతానికి ఆస్తిని ఉపయోగించకపోవచ్చు, కానీ అది నాకు ఆదాయాన్ని సంపాదించిపెడుతుందని అన్నారు. కాలక్రమేణా విలువ తగ్గుతున్న హై హీల్స్, బ్యాగులపై విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా, జాగ్రత్తగా డబ్బును పొదుపు చేయండి ఆమె యువతకు సలహా ఇచ్చింది.

ఇదీ చదవండి: నాడు కట్టుబట్టలతో ప్రయాణం: నేడు దుబాయ్‌లో వేలమందికి ఉద్యోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement