పోస్కోతో ఈబీజీ గ్రూప్‌ ఒప్పందం | EBG Group Signs Agreement With POSCO | Sakshi
Sakshi News home page

పోస్కోతో ఈబీజీ గ్రూప్‌ ఒప్పందం

Jun 30 2026 9:37 AM | Updated on Jun 30 2026 9:39 AM

EBG Group Signs Agreement With POSCO

భారత్‌లో డేవూ గృహోపకరణాల తయారీకి బ్రాండ్‌ లైసెన్సింగ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో డేవూ బ్రాండ్‌ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దక్షిణ కొరియన్‌ సంస్థ పోస్కో ఇంటర్నేషనల్‌తో బ్రాండ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఈబీజీ గ్రూప్‌ వెల్లడించింది. దీని ప్రకారం భారత్‌లో డేవూ బ్రాండ్‌ ఉపకరణాల అభివృద్ధి, తయారీ, పంపిణీ, మార్కెట్‌ విస్తరణను ఈబీజీ గ్రూప్‌ నిర్వహిస్తుంది.

ఇందుకోసం రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 100 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. తొలి దశలో ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు మొదలైనవాటిపై దృష్టి పెడుతుంది. ఢిల్లీలో మొదిట ఫ్లాగ్‌íÙప్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ త్వరలో ప్రారంభం కానుండగా, మరో మూడు ఔట్‌లెట్స్‌ సిద్ధమవుతున్నాయి. 2027 నాటికి 100 స్టోర్ల నెట్‌వర్క్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే డేవూ వన్‌ పేరిట సమగ్ర స్మార్ట్‌ హోమ్‌ ఎకోసిస్టమ్‌ని కూడా ప్రవేశపెట్టాలనే యోచన ఉన్నట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement