12 శాతం వృద్ధి లక్ష్యం: డాలర్‌ ఇండస్ట్రీస్‌ | Dollar Industries records highest ever turnover | Sakshi
Sakshi News home page

12 శాతం వృద్ధి లక్ష్యం: డాలర్‌ ఇండస్ట్రీస్‌

Jun 14 2024 3:27 AM | Updated on Jun 14 2024 8:07 AM

Dollar Industries records highest ever turnover

హైదరాబాద్‌ , బిజినెస్‌ బ్యూరో: డాలర్‌ ఇండస్ట్రీస్‌ 2024–25లో 12% ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.506 కోట్ల టర్నోవర్‌పై రూ.90 కోట్ల నికరలాభం ఆర్జించింది. సంస్థ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని ఎండీ వినోద్‌ కుమార్‌ గుప్తా మీడియాకు తెలిపారు. 

‘సంస్థ మొత్తం అమ్మకాల్లో దక్షిణాది వాటాను 20 శాతానికి చేరుస్తాం. ఈ ప్రాంతంలో మూడేళ్లలో 50 ఔట్‌లెట్లను తెరుస్తాం’ అని అన్నారు. 2025 –26లో రూ.2,000 కోట్ల టర్నోవర్‌ సాధిస్తామని జేఎండీ బినయ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. బ్రాండెడ్‌ హొజైరీ రంగంలో కంపెనీ మార్కెట్‌  వాటా 15 శాతం. 

Advertisement
 
Advertisement
Advertisement