పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ కన్నుమూత | Chairman Of PM's Economic Advisory Council, Bibek Debroy Passed Away | Sakshi
Sakshi News home page

పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ కన్నుమూత

Nov 1 2024 12:17 PM | Updated on Nov 1 2024 12:35 PM

Chairman Of PM's Economic Advisory Council, Bibek Debroy Passed Away

ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ 'బిబేక్ దెబ్రాయ్' (69) శుక్రవారం ఉదయం 7 గంటలకు కన్నుమూశారు. ఈయన మృతికి నరేంద్ర మోదీ నివాళులు అర్పిస్తూ.. దేబ్రాయ్ ఉన్నత పండితుడని అభివర్ణించారు.

డా. బిబేక్ దెబ్రాయ్ ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. తన రచనల ద్వారా భారతదేశ మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు. ప్రాచీన గ్రంథాలపై పని చేయడంలో ఆనందాన్ని పొందారని మోదీ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బిబేక్ దెబ్రాయ్ మృతికి సంతాపం తెలియజేసారు. ఆయన విశిష్ట ఆర్థికవేత్త, నిష్ణాతులైన రచయిత, అద్భుతమైన విద్యావేత్త. ఆర్థిక సమస్యలను అవలీలగా పరిష్కరిస్తూ.. భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఈయన ప్రశంసనీయులని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

2019 జూన్ 5 వరకు నీతి ఆయోగ్ సభ్యులుగా పనిచేసిన దెబ్రాయ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. పూణేలోని గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE)కి ఛాన్సలర్‌గా పనిచేసిన ఈయన.. అనేక పుస్తకాలు, పేపర్లు, ప్రముఖ కథనాలను రచించారు. అంతే కాకుండా అనేక వార్తాపత్రికలతో కన్సల్టింగ్/కంట్రిబ్యూటింగ్ ఎడిటర్‌గా కూడా ఉన్నారు.

నరేంద్రపూర్‌లోని రామకృష్ణ మిషన్ స్కూల్‌లో చదువుకున్న దెబ్రాయ్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో పనిచేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement