
ప్రధానమత్రి ఆర్థిక మండలి(EAC–PM) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అయోధ్య రాముడి భక్తిగీతాలకు ఆయన ఉత్సాహంగా నృత్యం చేశారు. అది కూడా ఓ సాధారణ వ్యక్తిగా నవ్వతూ చిందులేశారు. ఆ నృత్యం అక్కడున్న వారందని ఆకర్షించడమే కాదు..ఒక్క క్షణం తన హోదాను మరిచిపోయి భక్తిపారవశ్యంతో చేస్తున్న ఆ నృత్యం అందరిని అలరించింది. న్యూఢిల్లీలో సంగమ్ టాక్స్ నిర్వహించిన స్వరాజ్య కాన్క్లేవ్ 2025 సందర్భంగా ఆర్థికవేత్త సన్యాల్ భజనల్లో పాల్గొన్నారు.
ప్రముఖు వక్తల ఉపన్యాసం సెషన్ల జనసందోహలోనే సీనియర్ ఆర్థికవేత్త తన సాధారణ విధాన కేంద్రీకృత ఇమేజ్‌ను పక్కకు యువకుడి మాదిరిగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోని ఒక సోషల్ మీడియా యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ. ప్రధాని ఆర్థిక వ్యవస్థను నడపడానికి సహాయపడే వ్యక్తి పదివ శతాబ్దపు నౌకా నిర్మాణ వేత్తగా స్టెప్పులు వేస్తూ..చరిత్ర పాఠ్యపుస్తకాలను తిరగ రాసేలా రామభజనలకు బ్రేక్ డ్యాన్స్‌లు వేశాడు అని పేర్కొన్నారు.
కాగా, ఆయన భారతదేశ సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై స్పష్టమైన అభిప్రాయల చర్చలో కూడా పాల్గొన్నారు. అలాగే చార్టడ్ అకౌంటెంట్ కంటెంట్ క్రియేటర్ కుశాల్ లోధా పాడ్‌కాస్ట్‌లో కూడా అతను వ్యవస్థపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టాడు. చాలామంది ఈ సివిల్స్ ఎగ్జామ్ సుమారు 99% మంది వైఫల్యమవుతున్నారు. అయినా అన్నేళ్లు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం వృధా చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు కూడా. అంతేగాక దేశం ఈ పరీక్ష విధానంలోని అసమాన ప్రాముఖ్యతను పునః పరిశీలించాలని భావించారు కూడా.
Imagine being the guy who helps the PM run the economy, cosplays as a 10th-century shipbuilder, rewrites history textbooks… and then break dances on Ram bhajans.
Yeah, that’s @sanjeevsanyal 🙇🏻 pic.twitter.com/RAQBdvioT4— Prateek (@poignantPrateek) August 22, 2025