
ఈ రోజుల్లో ప్రేమ అనే పదం కనుమరుగైపోతోంది. పచ్చని సంసారాలు చిన్న చిన్న అపార్థాలతో భగ్గుమంటున్నాయి. అలాంటి తరుణంలో కొన్ని ప్రేమకథలు వింటుంటే..అలాంటి ప్రేమలు ఇప్పుడెందుకు ఉండటం లేదు అనిపిస్తోంది. అలాంటి భావోద్వేగభరిత లవ్‌స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.
అదేంటంటే..భారత మాజీ ఆర్మీ అదికారి కెప్టెన్ ధర్మవీర్ సింగ్ తన ప్రియురాలు రాసిన లేఖను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె అతడి అర్థాంగి. తాను 2001 ఆ టైంలో చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరినప్పుడు రాసిన లవ్‌లెటర్ అని చెప్పుకొచ్చారు. తన స్నేహితురాలైన ఠాకురైన్ ఆ ప్రేమలేఖ రాసినట్లు వివరించారు.
అయితే సైనిక అకాడమీలో లెటర్‌లు మావద్దకు చేరాలంటే సీనియర్లు పెట్టే షరతులను, టెస్ట్‌లను అంగీకరించాల్సి వచ్చేది. అయితే తనకు వచ్చిన లేఖ చాలా బరువుగా ఉందంటూ తన సీనియర్లు తన చేత ఏకంగా 500 పుష్‌అప్‌లు చేయాలని బలవంతం పెట్టారట. దాంతో చేసేదేమి లేఖ అన్ని పుష్‌అప్‌లు చేయక తప్పలేదని చెప్పుకొచ్చారు. తాను అకాడమీలో ఉండగా అందుకున్న మొదటి లేఖ అదేనట.
రాయడానికి ఎంత టైం పట్టిందో గానీ, ఆ భావాలు తన మనసులో ఇంకా అలానే పదిలంగా ఉన్నాయంటూ ఆ లేఖ తాలుకా వీడియోని జత చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆ వీడియోని చూసి ఆమెది చాలా అందమైన చేతిరాత, మీ ప్రేమ కథ హృదయాన్నిదోచే గొప్ప ప్రేమకథ అని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు.
(చదవండి: ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!)