
ఒక్క చిరునవ్వు సంభాషణతో పనిలేకుండా చేస్తుంది. అదే వెయ్యి మాటలకు సమానం అని చెప్పొచ్చు. కొందరు ప్రతి మాటకు చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పి..అవతలి వారి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి హృదయపూర్వక సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఆమె ఆ ఒక్క సంజ్ఞతో సంభాషణకు తావివ్వకుండా మాట్లాడింది.
అందుకు సంబంధించిన వీడియోనెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సంచిత అగర్వాల్ అనే కంటెంట్ క్రియేటర్ ఒక వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది అచ్చం సినిమాలో కనిపించే సన్నివేశంలా ఉంటుంది. ఆ వృద్ధ మహిల కృజ్ఞత చూపిస్తూ..ఆమె సాయం తీసుకుంటుంది.
ఆ కారు ఎక్కగానే ఆమె ముఖం వెలిగిపోతుంది. ఎక్కడకి వెళ్లున్నావని సంచిత ప్రశ్నించగా ఆమె "జీవన్ భారతి" అని సమాధానం ఇస్తుంది. గమ్యస్థానంకి చేరుకోగానే కంటెంట్ క్రియేటర్ జాగ్రత్తలు చెబుతూ నిష్క్రమిస్తుంది. అయితే ఆమె మాత్రం మారుమాట్లాడకుండా ఒక్క చిరునవ్వుతో సమాధానమిస్తుంది.
చిన్న స్మైల్‌తో తన భావన అంతా చెబుతున్నట్లుగా ఉంది ఆ వృద్ధురాలి నవ్వు. ఆ నవ్వులో ఏదో మాయ జాలం ఉంది అంటూ ఇన్‌స్టాలో ఆ విషయాన్ని షేర్ చేసుకుంది కంటెంట్ క్రియేటర్. అంతేగాదు కొన్నిసార్లు జీవితంలో సినిమాలోని సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని పంచుకున్నారామె. ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్ల వ్యూస్, లైక్‌లు వచ్చాయి. ఇంకెందుకు మీరు ఓ లుక్కేయండి మరి..
(చదవండి: వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది)