పీఎల్‌ఐ స్కీములకు రూ. 36,754 కోట్లు  | Central Government approves Rs 36,754 crore for PLI schemes | Sakshi
Sakshi News home page

పీఎల్‌ఐ స్కీములకు రూ. 36,754 కోట్లు 

Sep 26 2026 5:27 AM | Updated on Sep 26 2026 5:27 AM

Central Government approves Rs 36,754 crore for PLI schemes

2020 నుంచి విడుదల చేసిన కేంద్రం 

న్యూఢిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలను ప్రోత్సహించేందుకు కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా స్కీములను ప్రవేశపెట్టిన 2020 నుంచి ఈ ఏడాది జూన్‌ 30 వరకు వీటికి సంబంధించిన లబి్ధదారులకు రూ. 36,754 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా భారీ స్థాయి ఎల్రక్టానిక్స్‌ విభాగానికి రూ. 19,091 కోట్లు అందించింది. ఆ తర్వాత స్థానాల్లో ఫార్మా (రూ. 6,662 కోట్లు), ఆహార ఉత్పత్తులు (రూ. 3,271 కోట్లు), ఆటో–ఆటో విడిభాగాల (రూ. 3,174 కోట్లు) సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ 30 వరకు ఈ స్కీముల కోసం ప్రభుత్వం రూ. 1,400 కోట్లు విడుదల చేసింది.

 పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2025–26లో రూ. 15,519 కోట్లు, 2024–25లో రూ. 10,114 కోట్లు కేంద్రం అందించింది. దేశీయంగా తయారీ సామర్థ్యాలను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను ప్రోత్సహించడం, ఉపాధి కల్పన, దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించుకోవడం లాంటి లక్ష్యాలతో 2020లో 14 రంగాల కోసం రూ. 1.91 లక్షల కోట్ల కేటాయింపులతో ప్రభుత్వం ఈ స్కీములను ప్రకటించింది. ఈ పథకాలతో రూ. 2.58 లక్షల కోట్ల పెట్టుబడులు, 14.57 లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరిగినట్లు డీపీఐఐటీ వివరించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement