BMW M2 Launched in India: Check price, features and details - Sakshi
Sakshi News home page

BMW: భారత్‌లో బీఎండబ్ల్యూ ఎం2 లాంచ్ - ధర ఎంతో తెలుసా?

Jun 9 2023 7:23 AM | Updated on Jun 9 2023 8:57 AM

Bmw m2 india launched price features and details - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో ఎం2 స్పోర్ట్స్‌ కారును ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.98 లక్షలు. రెండు డోర్లు, నాలుగు సీట్లను కలిగి ఉంది. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు.

బీఎండబ్ల్యూ ఎమ్2 3.0 లీటర్ 6 సిలిండర్‌ ఇన్‌లైన్‌ పెట్రోల్‌ ఇంజన్‌  పొందుతుంది. ఇది 460 hp పవర్ & 550 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో 4.1 సెకన్లు, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో 4.3 సెకన్లలో అందుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement