ఏబీఎస్‌ఎల్‌ఐ స్మార్ట్ వెల్త్ పెన్షన్ ప్లాన్
రిటైర్మెంట్ అనంతర ఆర్థిక అవసరాల కోసం ఫండ్‌ను నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ (ఏబీఎస్‌ఎల్‌ఐ) స్మార్ట్ వెల్త్ పెన్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో ప్రీమియంలు, ప్రయోజనాలను బట్టి అడ్వాంటేజ్, ప్రైమ్, ఎలీట్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు. సింగిల్, జాయింట్ లైఫ్ ఆప్షన్లు ఉంటాయి. జాయింట్ లైఫ్ ఆప్షన్‌లో పాలసీదారుల్లో ఒకరు కన్నుమూసినా, పాలసీ కొనసాగేలా ప్రీమియం వెయివర్ ఆప్షన్ ఉంటుంది. రిస్కు ప్రొఫైల్‌ని బట్టి, రిటైర్మెంట్ లక్ష్యాలకు తగ్గట్లుగా 5 ఫండ్స్, 4 ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల నుంచి ఎంచుకోవచ్చు. మహిళలకు మరికాస్త ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి.
‘కోటక్ ప్రొటెక్ట్ అడ్వాంటేజ్’ టర్మ్ ప్లాన్
కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ, పాలసీబజార్ కలిసి ’కోటక్ ప్రొటెక్ట్ అడ్వాంటేజ్’ పేరిట టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఆవిష్కరించాయి. ఇందులో అత్యధిక స్థాయి లైఫ్ కవరేజీతో పాటు కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన పలు ఫీచర్లు ఉన్నాయి. జీవితంలో కీలక దశల్లో కవరేజీని పెంచుకోవడం, ప్రీమియం చెల్లింపుల నుంచి కొంత విరామం తీసుకోవడం, రూ. 2 లక్షల క్లెయిమ్ ఇంటిమేషన్‌పై తక్షణ చెల్లింపులు, ప్రీమియం వాపసుతో స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి.
యాక్సిస్ పెన్షన్ ఫండ్ ‘ఎన్‌పీఎస్ స్వాస్థ్య’ స్కీము
దీర్ఘకాలికంగా రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తూనే అటు వైద్య చికిత్స వ్యయాల కోసం కూడా ప్రత్యేక ఫండ్‌ని కూడా ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తూ యాక్సిస్ పెన్షన్ ఫండ్ మేనేజ్‌మెంట్ కొత్తగా యాక్సిస్ ఎన్‌పీఎస్ స్వాస్థ్య స్కీమును అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం ఎన్‌పీఎస్ సబ్‌్రస్కయిబర్స్ తాము చెల్లించే మొత్తంలో 25% వరకు భా గాన్ని మార్కెట్ ఆధారిత ఎమర్జెన్సీ ఫండ్‌కి కేటాయించవచ్చు.
ఇదీ చదవండి: కొడుకు ఆస్తిపై తండ్రికి హక్కు లేదా?.. చట్టం ఏం చెబుతుందంటే!


