ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కొత్త ప్లాన్లు వచ్చేశాయ్‌! | Airtel Launches New Recharge Plans Starting At Rs 185 Ahead Of TRAI Deadline | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కొత్త ప్లాన్లు వచ్చేశాయ్‌!

Oct 18 2026 4:23 PM | Updated on Oct 18 2026 4:54 PM

Airtel Launches New Recharge Plans Starting At Rs 185 Ahead Of TRAI Deadline

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) తన వినియోగదారుల కోసం మూడు కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జి ప్లాన్ల(రూ.185, రూ.203, రూ.206)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లలో కేవలం వాయిస్‌ కాల్స్‌, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.

డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలన్న ట్రాయ్‌ (TRAI) వెల్లడించడంతో.. ఎయిర్‌టెల్‌ ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది.

  • రూ.185 ప్లాన్‌: ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. దీంతో అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

  • రూ.203 ప్లాన్‌: ఈ ప్లాన్‌ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.185 ప్లాన్‌లో ఉన్నట్లుగానే అపరిమిత కాల్స్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు.

  • రూ.206 ప్లాన్‌: ఈ ప్లాన్‌లోనూ అపరిమిత కాల్స్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే, ఒక క్యాలెండర్ నెల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

ఈ మూడు ప్లాన్లు ఎయిర్‌టెల్‌ అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొబైల్‌ డేటా మాత్రమే కాకుండా.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు వంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. ప్రధానంగా ఫీచర్‌ ఫోన్లు ఉపయోగించేవారికి, ఇంటర్నెట్‌ కోసం వైఫైపై ఆధారపడేవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. డేటా అవసరం లేకపోయినా కాల్స్‌ కోసం ఎక్కువ మొత్తంలో రీఛార్జి చేసుకునే వినియోగదారులు ఈ ప్లాన్లను ఎంచుకోవచ్చు. తద్వారా అవసరం లేని డేటా కోసం డబ్బు ఖర్చు చేయకుండా రీఛార్జ్ భారాన్ని తగ్గించుకోవచ్చు.

ఇదీ చదవండి: పండగొచ్చిందని బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement