జూలై 1 నుంచి బజాజ్‌ ఆటో షేర్ల బైబ్యాక్‌ | Bajaj Auto's Share Buyback Process | Sakshi
Sakshi News home page

జూలై 1 నుంచి బజాజ్‌ ఆటో షేర్ల బైబ్యాక్‌

Jun 30 2026 9:58 AM | Updated on Jun 30 2026 10:44 AM

Bajaj Auto's Share Buyback Process

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో రూ.5,632 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. బైబ్యాక్‌లో భాగంగా దాదాపు 46.94 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. ప్రతి షేరు ధరను రూ.12,000 గా నిర్ణయించారు. ఈ ఆఫర్‌ జూలై 7న ముగుస్తుందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు బజాజ్‌ ఆటో బోర్డు మే 6న ఆమోదం తెలపగా... మే 14న పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా షేర్‌హోల్డర్లు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement