రోజువారీగా చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసే వీలు కల్పిస్తూ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రత్యేకంగా ‘రోజానా సిప్’ని ప్రవేశపెట్టింది. దీని కింద సంస్థ వెబ్‌సైట్ ద్వారా ఒక్కో స్కీములో రోజుకు అత్యంత తక్కువగా రూ.10 నుంచి సిప్ విధానంలో పెట్టుబడి పెట్టొచ్చు. కనీసం రెండు స్కీములను ఎంచుకోవాల్సి ఉంటుంది.
వీలును బట్టి తర్వాత 10 స్కీముల వరకు వీటిని పెంచుకోవచ్చు. యాక్సిస్ మల్టీక్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, వేల్యూ ఫండ్ మొదలైనవి ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని మదుపరులకు మరింత చేరువ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ డిజిటల్ బిజినెస్ హెడ్ బొనిఫేస్ నొరోన్హా తెలిపారు.
పరిమిత పొదుపు, పెట్టుడులపై అవగాహన లేమి, మార్కెట్ హెచ్చుతగ్గులపై భయంలాంటివి ఉండే కొత్త ఇన్వెస్టర్ల సమస్యలను పరిష్కరించేలా దీన్ని రూపొందించినట్లు వివరించారు.


