యాపిల్‌ మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ ధరలు భారీగా పెరిగాయ్‌ | Apple MacBook iPad Price Hikes India by Up to 42 percent ai memory chip costs | Sakshi
Sakshi News home page

యాపిల్‌ మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ ధరలు భారీగా పెరిగాయ్‌

Jun 26 2026 7:59 AM | Updated on Jun 26 2026 11:14 AM

Apple MacBook iPad Price Hikes India by Up to 42 percent ai memory chip costs

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు భారత్‌లోనూ టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ మోడళ్ల ప్రారంభ ధరలను భారీగా పెంచింది. లాంచ్‌ ధరలతో పోలిస్తే వీటిపై ఏకంగా 20 శాతం నుండి 42 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విస్తరణతో మెమరీ చిప్‌ల కొనుగోలు ఖర్చులు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

యాపిల్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. ‘ఎం5’ సిరీస్‌ చిప్‌తో పనిచేసే మ్యాక్‌బుక్‌ ప్రో ధరలను కంపెనీ దాదాపు 20 శాతం మేర పెంచింది. ఎం5 ప్రో చిప్‌తో కూడిన 14–ఇంచుల మ్యాక్‌బుక్‌ ప్రో ప్రారంభ ధర రూ. 2,49,900 ఉండగా, ఇప్పుడది రూ. 2,99,900కి చేరింది. ఐప్యాడ్‌ ఎయిర్‌ ధరలో అత్యధిక పెరుగుదల నమోదైంది. బేసిక్‌ మోడల్‌ 13–ఇంచుల ఐప్యాడ్‌ ఎయిర్‌ ధర 41.22 శాతం పెరిగింది. రూ. 84,900 గా ఉన్న ఈ వేరియంట్‌ ధర ఇప్పుడు రూ. 1,19,900 కి చేరింది.

మార్కెట్‌ ఒత్తిడి తట్టుకోలేకపోయాం: యాపిల్‌ 
ప్రస్తుతం కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ రంగం తీవ్రమైన స వాళ్లను ఎదుర్కొంటోందని యాపిల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఏఐ డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణతో మెమరీ, స్టోరేజ్‌ చిప్‌లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. విడిభాగాల ధరలు ఇంత స్వల్ప కాలంలో ఈ స్థాయిలో పెరగడం ఎప్పుడూ చూడలేదు. ఇప్పటివరకు ఈ భారాన్ని వినియోగదారులపై పడకుండా కాపాడుకుంటూ వచ్చాం. కానీ, ఇకపై భరించలేని పరిస్థితితో ఐప్యాడ్, మ్యాక్‌ వంటి ఉత్పత్తుల ధరలను పెంచక తప్పలేదు’ అని యాపిల్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement