
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయిల్ నగరం టెల్ అవీవ్‌కు విమానాల సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఢిల్లీ - టెల్ అవీవ్ మధ్య డైరెక్ట్ విమానాలు ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎయిరిండియా ఢిల్లీ - ఇజ్రాయెల్ దేశానికి వారానికి నాలుగు విమానాలను నడుపుతోంది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా దాదాపు ఐదు నెలల విరామం తర్వాత మార్చి 3న టెల్ అవీవ్‌కు సేవలను పునఃప్రారంభించింది. ఇజ్రాయెల్ నగరంపై హమాస్ దాడి నేపథ్యంలో ఢిల్లీ నుండి టెల్ అవీవ్ విమానాల రాకపోకల్ని నిలిపి వేసింది.