రికార్డులు సృష్టిస్తోన్న ఆధార్‌ యాప్‌.. | Aadhaar App Hits 31 Million Downloads in 5 Months how to download | Sakshi
Sakshi News home page

రికార్డులు సృష్టిస్తోన్న ఆధార్‌ యాప్‌..

Jun 23 2026 1:38 PM | Updated on Jun 23 2026 1:50 PM

Aadhaar App Hits 31 Million Downloads in 5 Months how to download

ఆధార్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఆరంభించిన ఐదు నెలల్లోనే 3.1 కోట్ల మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కొత్త ఆధార్‌ యాప్‌ ద్వారా ఇప్పటికే 40 లక్షల మంది తమ మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోగా, 8.5 లక్షల మంది యాప్‌ సాయంతో తమ చిరునామానూ సైతం మార్చుకున్నారు.

ఆధార్‌ యాప్‌నకు ఆమోదం పెరుగుతున్నట్టు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రకటించింది. స్మార్ట్‌ ఫోన్‌ నుంచే సులభంగా సేవలు పొందే విషయంలో పౌరుల్లో విశ్వాసం పెరుగుతున్నట్టు తెలిపింది. మొబైల్, చిరునామా అప్‌డేట్‌తోపాటు భౌతిక కార్డుకు బదులు యాప్‌లోని క్యూఆర్‌ సాయంతో తమ కాంటాక్టు వివరాలను డిజిటల్‌గా పంపుకునే సదుపాయం ఇందులో ఉన్నట్టు వెల్లడించింది. బయోమెట్రిక్‌ లాక్‌/అన్‌లాక్, ముఖ గుర్తింపు ధ్రువీకరణ, క్యూఆర్‌ ఆధారిత కాంటాక్టు కార్డ్‌ తదితర ఎన్నో ఫీచర్లు ఉన్నట్టు పేర్కొంది.

ఆధార్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

  • మీ మొబైల్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ఓపెన్‌ చేయండి.

  • సెర్చ్‌ బార్‌లో "Aadhaar App" అని టైప్‌ చేయండి.

  • UIDAI విడుదల చేసిన అధికారిక యాప్‌ను ఎంపిక చేసుకోండి.

  • Install/Download బటన్‌పై క్లిక్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

  • ఇన్‌స్టాలేషన్‌ పూర్తయ్యాక మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వండి.

  • OTP ధ్రువీకరణ అనంతరం ఆధార్‌కు సంబంధించిన సేవలను వినియోగించుకోవచ్చు.

  • మొబైల్‌ నంబర్‌, చిరునామా అప్‌డేట్‌, బయోమెట్రిక్‌ లాక్/అన్‌లాక్‌, ఫేస్‌ ఆథెంటికేషన్‌, క్యూఆర్‌ కోడ్‌ షేరింగ్‌ వంటి సేవలను యాప్‌లోనే పొందవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement