ప్రాజెక్ట్‌ల వారీగా
వచ్చిన దరఖాస్తులు
● కొనసాగుతున్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ ● వివిధ కారణాలతో 3,588 దరఖాస్తులు తిరస్కారం ● పూర్తయిన ఇంటర్వ్యూలు.. త్వరలో నియామకాలు
భద్రాచలంఅర్బన్: జిల్లాలో అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. మరో 15 రోజుల్లో నియామకాలు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 178 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా 4,648 దరఖాస్తులు అందాయి. పరిశీలించిన అధికారులు 1,060 మందిని ఇంటర్వ్యూలకు అర్హులుగా గుర్తించారు. మిగిలిన 3,588 దరఖాస్తులను తిరస్కరించారు. వయోపరిమితి, స్థానికత తదితర కారణాలతో తిరస్కరించినట్లు ఐసీడీఎస్ అధికారులు చెబు తున్నారు. పరిశీలన దశలోనే 77 శాతం దరఖాస్తులు నిలిచిపోగా, 23 శాతమే అర్హత సాధించాయి. ఏ కారణం చేత ఎన్ని దరఖాస్తులు అర్హత పొందలేదనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. కాగా పాల్వంచ ప్రాజెక్ట్ పరిధిలో అత్యధికంగా 29 పోస్టులు ఉండగా దరఖాస్తులు కూడా అదేస్థాయిలో వచ్చా యి. పాల్వంచలో 160 మంది, టేకులపల్లిలో 148, బూర్గంపాడులో 126, మణుగూరులో 122, ఇల్లెందులో 115 మంది, కొత్తగూడెం, దుమ్ముగూడెం ప్రాజెక్టుల్లో 84మంది చొప్పున ఇంటర్వ్యూకు అర్హత పొందారు. 1,060 మందిని ఇంటర్వ్యూలకు పిలవగా 1,021 మంది హాజరయ్యారు. 39 మంది గైర్హాజరయ్యారు.
తుది జాబితా కోసం ఎదురుచూపు
ఇంటర్వ్యూలు పూర్తికావడంతో అభ్యర్థులు తుది జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. ఒకే అంగన్‌వాడీ కేంద్రంలోని పోస్టుకు పలువురు అర్హులైన సందర్భాల్లో నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎంపిక నిబంధనల ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అధికారులు తుది జాబితాల రూపకల్ప నపై దృష్టి సారించారు. మరో వారం రోజుల్లో ప్రక్రి య పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నియామకాలు పూర్తయితే ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు అందుబాటులోకి రానున్నారు.
ప్రాజెక్ట్ పోస్టులు దరఖాస్తులు
పాల్వంచ 29 765
మణుగూరు 24 751
కొత్తగూడెం 16 514
టేకులపల్లి 19 473
ఇల్లెందు 21 457
బూర్గంపాడు 10 379
దుమ్ముగూడెం 12 369
దమ్మపేట 16 300
అశ్వారావుపేట 11 238
చంద్రుగొండ 8 224
చర్ల 12 178


