గోదావరిలో అమ్మవారి విగ్రహాల నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో అమ్మవారి విగ్రహాల నిమజ్జనం

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

భద్రాచలం అర్బన్‌: శ్రీదేవీ శరన్నరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం కోసం భద్రాచలంలో గోదావరికి తీసుకొస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు 180 అమ్మవారి విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు సమాచారం. నిమజ్జనానికి వస్తున్న విగ్రహాల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒకే లాంచీని వినియోగిస్తున్నారు. వివిధ శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం కూడా నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది.

2,680 మె.టన్నుల యూరియా

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు బుధవారం ఇఫ్‌కో కంపెనీకి చెందిన 2,680.02 మెట్రిక్‌ టన్నుల యూరియా చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 1,080.02 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 900 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 600 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయాధి కారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మెట్రిక్‌ టన్నులను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.

25న అండర్‌–19

క్రికెట్‌ జట్ల ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లా జూనియర్‌ కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన ఈనెల 25వ తేదీన అండర్‌–19 బాలబాలికల క్రికెట్‌ జట్లను ఎంపిక చేయనున్నారు. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో 25వ తేదీన ఎంపిక పోటీలు జరుగుతాయని సంఘం జిల్లా కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు సొంత కిట్‌తో హాజరుకావాలని వారు ఓ ప్రకటనలో సూచించారు.

సమష్టి కృషితో

ఉత్పత్తి లక్ష్య సాధన

మణుగూరు టౌన్‌: ఉద్యోగులు సమష్టిగా కృషి చేస్తూ బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఎల్‌. వీ. సూర్యనారాయణ సూచించారు. మణుగూరు ఏరియాలో జీఎం దుర్గం రాంచందర్‌తో కలిసి బుధవారం ఆయన కేసీహెచ్‌పీ, పీకేఓసీ–2 గనులను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, క్రషర్ల పనితీరును పరిశీలించాక డైరెక్టర్‌ మాట్లాడుతూ ఏరియా వార్షిక లక్ష్యం 122.10 లక్షల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి కోసం రోజూ 40వేల టన్నులు వెలికితీయాలని తెలి పారు. యంత్రాలతో నిరంతరాయంగా పనులు చేపడితే ఫలితం ఉంటుందని చెప్పారు. అలాగే, పీకేఓసీ–2లోని నీటిని సకాలంలో తొలగించాలని సూచించారు. వివిధ విభాగాల అధికారులు మదన్‌నాయక్‌, గౌడే, సౌరభ్‌ సుమన్‌, సురేశ్‌, నాగరమేశ్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

కిన్నెరసానిలో

దసరా సందడి

రూ.2లక్షలకు చేరువగా నమోదైన

మూడు రోజుల ఆదాయం

పాల్వంచరూరల్‌: దసరా పండగ సందర్భంగా మండలంలోని పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సందర్శకుల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లా నుంచే వివిధ ప్రాంతాల సందర్శకులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా డ్యామ్‌పై నుంచి జలాశయం, డీర్‌ పార్కులోని దుప్పులను వీక్షించడమే కాక బోటు షికారు చేస్తూ ఆనందంగా గడిపారు. ఈమేరకు 19నుంచి 21వ తేదీ వరకు 1,473 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్‌ శాఖ రూ.1,19,255, సఫారీ వాహనాల ద్వారా రూ.20,550, 1,020మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్‌ సంస్థకు రూ.51,870 ఆదాయం సమకూరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement