అశ్వారావుపేటరూరల్/మణుగూరు రూరల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగాలని ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్ సూచించారు. అశ్వారావుపేటలో బుధవారం జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షత వహించగా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ..సర్వోత్తమ్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిపించేలా ఓటర్ల నమోదు చేయించి, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అలాగే, మణుగూరులో జరిగిన సమావేశంలో ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాంనాయక్‌తో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీలక్ష్మీప్రసన్న మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ప్రజాప్రతినిధులు, నాయకులు వీరభద్రరావు, చిన్నంశెట్టి సత్యనారాయణ, మొగళ్లపు చెన్నకేశవరావు, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, తోలెం కల్యాణి, పీరినాకి నవీన్, కురం రవి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాంనాయక్


