భద్రాచలంఅర్బన్: పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంలో ఆహార భద్రతా శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. 30 కిలోల డాల్డా, 10 లీటర్ల నెయ్యి, 15 లీటర్ల పామాయిల్, మూడు కిలోల వెన్నను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపంపారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన యువరాజ్ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గతంలోనూ ఇదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తి కల్తీ నెయ్యి తయారీ వ్యవహారంలో పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.
గంజాయి సేవించిన
ముగ్గురిపై కేసు
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఓ హోటల్లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బంది గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకుని సోమవారం కేసు నమోదు చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గోదావరి కరకట్ట వద్ద గంజాయి సేవించిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన షేక్ షానవాజ్, మీర్ రోహిత్, హసన్ కాగా, భద్రాచలం అశోక్‌నగర్ కాలనీలో నివాసముంటూ గీతాంజలి హోటల్లో వంట సిబ్బందిగా పనిచేస్తున్నారని సీఐ సట్ల రాజు తెలిపారు.


