365 రోజుల్లో పాలేరుకు సీతారామ జలాలు | - | Sakshi
Sakshi News home page

365 రోజుల్లో పాలేరుకు సీతారామ జలాలు

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

జూలూరుపాడు: ఏడాదిలో సీతారామ ప్రాజెక్టు టన్నెల్‌ పనులు పూర్తి చేసి పాలేరుకు నీరందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం పాపకొల్లు అటవీ ప్రాంతంలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్‌ టన్నెల్‌ నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. వినోభానగర్‌ సమీపంలోని రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టన్నెల్‌ పనులను వచ్చే దసరా లోగా పూర్తి చేస్తామన్నారు. పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తరలించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి రూ.4 వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు రెతులను ఒప్పించి లింక్‌ కాలువలు ఏర్పాటు చేస్తే 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. పాపకొల్లుకు చెందిన ఆత్మీయ మిత్రుడు రోకటి రంగారావు నివాసానికి మంత్రి వెళ్లి కలిశారు. వైరా ఎమ్మెల్యే మాళోత్‌ రాందాస్‌ నాయక్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్‌, గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మాళోత్‌ మంగీలాల్‌ పాల్గొన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement