మహిషాసురమర్దిని.. | - | Sakshi
Sakshi News home page

మహిషాసురమర్దిని..

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

పెద్దమ్మతల్లి ఆలయంలో

దసరా వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

నేడు శమీ పూజ, తెప్పోత్సవం

జయ జయ హే

పాల్వంచరూరల్‌: దసరా వేడుకలకు పెద్దమ్మతల్లి ఆలయం ముస్తాబైంది. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో తొమ్మిదిరోజులపాటు శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం దసరా పండగను పురష్కరించుకుని శమి పూజ చేయనున్నారు. ఈసారి నూతనంగా నిర్మించిన కోనేరులో తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేశారు. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు తరలివస్తున్నారు.

శమీ పూజ

దసరా పండగ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో జమ్మి చెట్టు వద్ద శమి పూజ నిర్వహించనున్నారు. వివిధ వేషధారణలతో కళాకా రుల నృత్యాలు, డప్పుచప్పుళ్లతో సందడి చేయనున్నారు. వేడుకలకు ఈఓ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్‌ దీపాలను అలంకరించడంతోపాటు కార్పెట్లు సిద్ధంచేశారు.

ఘనంగా చండీహోమం

శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పెద్దమ్మతల్లి అమ్మవారు సోమవారం శ్రీ మహిషాసుర మర్దినిదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మండలంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో తొమ్మిదో రోజు అర్చకులు అమ్మవారికి ప్రాత కాలర్చన, శ్రీ లక్ష్మీగణపతి అనుష్టాణం, వేదపారాయణం, నవగ్రహ జపాలు, శ్రీ చక్రార్చన, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, సువర్ణపుష్పార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, నాదనీరాజనం, మంత్రపుష్ప, దంపతుల పూజలు, సహస్రదీపాలంకరణ నిర్వహించారు.

దర్శించుకున్న ఎండోమెంట్‌ సహాయ కమిషనర్‌

పెద్దమ్మతల్లి అమ్మవారిని సోమవారం ఖమ్మం జిల్లా ఎండోమెంట్‌శాఖ సహాయ కమిషనర్‌ ఎం.వీరస్వామి దంపతులు, భద్రాచలం ఆలయ ఈఈ రవీంద్రనాథ్‌ దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దసరా ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ఈఓ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement