చట్టాన్ని చుట్టేశారు ! | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని చుట్టేశారు !

Aug 26 2026 12:54 AM | Updated on Aug 26 2026 12:54 AM

● భద్రాచలం ఎకై ్సజ్‌ శాఖలో అధికార దుర్వినియోగం ● తప్పును కప్పిపుచ్చుకునేందుకు రిమాండ్‌ పత్రాల్లో మార్పులు? ● స్క్రాప్‌ వాహనాల వేలంపైనా అనుమానాలు ● ఎకై ్సజ్‌ శాఖ అధికారిణి తీరుపై వరుస విమర్శలు

గతంలోనూ ఆరోపణలు

● భద్రాచలం ఎకై ్సజ్‌ శాఖలో అధికార దుర్వినియోగం ● తప్పును కప్పిపుచ్చుకునేందుకు రిమాండ్‌ పత్రాల్లో మార్పులు? ● స్క్రాప్‌ వాహనాల వేలంపైనా అనుమానాలు ● ఎకై ్సజ్‌ శాఖ అధికారిణి తీరుపై వరుస విమర్శలు

భద్రాచలం: చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే నిబంధనలను ఉల్లంఘించారా.. అక్రమాలను అరికట్టాల్సింది పోయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. భద్రాచలం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారిణి తీరుపై వస్తున్న ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణ, నిబంధనలు, చట్టాలను విస్మరించి ఓ వ్యవహారంలో రికార్డులు మార్చినట్లు వస్తున్న విమర్శలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.

ఇద్దరు నిందితులు.. రిమాండ్‌లో ఒక్కరే?

భద్రాచలం ఎకై ్సజ్‌ పరిధిలో ఇటీవల ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. పంచనామా అనంతరం ఇద్దరిని స్థానిక ఎకై ్సజ్‌ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. అయితే, వీరిద్దరు తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఒకరిని అధికారులు పట్టుకున్నా మరో వ్యక్తి పరారయ్యాడని తెలిసింది. ఈ పరిణామం అనంతరం కేసు రికార్డులు, రిమాండ్‌ పత్రాల విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రిమాండ్‌ పత్రాలు సిద్ధం చేయగా.. ఒకరు పారిపోయిన క్రమాన మిగతా నిందితుడి పేరుతోనే రిమాండ్‌ పత్రాల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం బయట పడి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా అంతర్గతంగా విచారణ చేస్తున్నారని సమాచారం

గంజాయి రవాణాపై నిఘా ఏదీ?

భద్రాచలం మీదుగా గంజాయి అక్రమ రవాణాపై తరచూ కేసులు నమోదవుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దాడుల్లో భారీగా గంజాయి పట్టుబడుతుండగా.. స్థానిక ఎకై ్సజ్‌ పోలీసుల తనిఖీల్లో పెద్దగా కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలకు దిగితే తప్ప కేసులు నమోదు కావడం లేదని తెలుస్తోంది. కాగా, రిమాండ్‌ పత్రాల్లో మార్పులు, వాహనాల వేలం తదితర అంశాలపై జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి వివరణ కోసం పలుమార్లు ఫోన్‌లో ప్రయత్నించగా స్పందించలేదు.

భద్రాచలం ఎకై ్సజ్‌ స్టేషన్‌లో సుదీర్ఘకాలంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సదరు అధికారిణిపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల్లో పట్టుబడిన వాహనాలకు ఇటీవల వేలం నిర్వహించారు. ఒకవేళ ఎవరూ కొనకపోతే వాహనాలను నిబంధనల ప్రకారం స్క్రాప్‌గా మార్చి విక్రయిస్తారు. అయితే స్క్రాప్‌గా పేర్కొన్న ఓ ఆటో రహదారులపై తిరుగుతుండడం గమనార్హం. స్క్రాప్‌ పేరుతో అమ్మినట్లు రికార్డుల్లో నమోదు చేసి, బయటి వ్యక్తులకు అమ్మడం ద్వారా సొమ్ము చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అంతేకాక శాఖ సిబ్బంది సైతం కొన్ని వాహనాలను సొంత అవసరాలకు వినియోగిస్తున్నారనే మరో ఆరోపణ ఉంది. అలాగే, ఇష్టారాజ్యంగా వెలుస్తున్న బెల్టు షాపులను అడ్డుకోవడంలోనూ అఽధికారిణి విఫలమయ్యారనే విమర్శలున్నాయి. మామూళ్ల మత్తులో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని బెల్ట్‌మయంగా మార్చారని, వందకు పైగా షాపులు ఏర్పడడంలో పరోక్షంగా సహకరించారని తెలుస్తోంది. రామాలయం పరిసర ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు జరుగుతున్నా అడ్డుకోలేకపోవడం ఎకై ్సజ్‌శాఖ పనితీరుకు నిదర్శంగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement