మెరుగైన బోధన, మెనూ అమలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన బోధన, మెనూ అమలు తప్పనిసరి

Aug 26 2026 12:54 AM | Updated on Aug 26 2026 12:54 AM

కొణిజర్ల: గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించడమే కాక మెనూ ప్రకారం పౌష్టికాహారం సమకూర్చాలని బీసీ గురుకులాల డిప్యూటీ సెక్రటరీ చక్రవర్తి ఆదేశించారు. కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డుల తనిఖీ అనంతరం ఎస్సెస్సీ విద్యార్థులతో మాట్లాడి బోధనపై ఆరాతీయడమే కాక పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. ఆతర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఆయన ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ప్రిన్సిపాల్‌ బి.నాగమణి, ఉపాధ్యాయులు రెడ్డి భాస్కర్‌, సీహెచ్‌.రంజిత్‌, తులసి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement