
బోల్తా పడిన బస్సు
దమ్మపేట: అదుపుతప్పిన మినీ బస్సు రోడ్డు పక్కన పొదల్లో బోల్తా పడిన ఘటన మండలంలోని గట్టుగూడెం శివారులో శుక్రవారం తెల్లవారుజాము న చోటుచేసుకుంది. ఏపీలోని వైజాగ్ నుంచి హన్మకొండకు ఓ శుభాకార్యానికి మినీ ప్రైవేట్ బస్సులో 20మంది వెళ్తున్నారు. ఆ బస్సు గట్టుగూడెం శివారుకు చేరుకోగా ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లో బోల్తాపడింది. కాగా బస్సులో ఉన్నవారికి స్వ ల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి, ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రు లను 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా
అశ్వారావుపేటరూరల్: జీడి మామిడి కలపతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ప్రధాన రహదారిపై బోల్తా పడిన ఘటన శుక్రవారం అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. మండలంలోని ఊట్లపల్లి వైపు నుంచి ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి వెళ్తున్న ట్రాక్టర్ స్థానిక సంత మార్కెట్ సమీపంలో రహదారిపై గుంతల కారణంగా అదుపుతప్పి పడిపోయింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న జీడి మామిడి కలప రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత కలపను మరో ట్రాక్టర్లో లోడు చేసి తరలించారు.
ఏడుగురు గిరిజన మహిళల అరెస్ట్
చర్ల: మండలంలోని మామిడిగూడెం సమీపంలోని అటవీభూముల్లో అధికారులు నాటిన వెదురుమొక్కలను ధ్వంసం చేసిన ఘటనలో ఏడుగురు గిరిజ న మహిళలను అరెస్టుచేశారు. దుమ్ముగూడెం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమల కథనం ప్రకారం.. పెదమిడిసిలేరు రిజర్వ్ ఫారెస్ట్‌లో దేవరాపల్లి బీట్‌లోని మామిడిగూడెం క్యాంప్ నంబర్ 65 (సీ)లో జూలై నుంచి హరితవనాల పెంపకంలో భాగంగా 50 హెక్టార్లలో సుమారు రూ.10లక్షలు వెచ్చించి వెదురు, టేకు మొక్కలు నాటారు. అయితే వీటితో పాటు మరికొంత విస్తీర్ణంలో నాటేందుకు కూడా సుమారు 3 వేల మొక్కలను ఆ ప్రాంతానికి తరలించారు. కాగా, మామిడిగూడెంనకు చెందిన కొందరు మహిళలు ఈ మొక్కలను ధ్వంసం చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన అటవీశాఖాదికారులు ఏడుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

బోల్తా పడిన బస్సు

బోల్తా పడిన బస్సు

బోల్తా పడిన బస్సు