
ఆదర్శంగా.. అద్భుతంగా..
డిజైన్ ఇలా..
అత్యాధునిక సౌకర్యాలతో 300 ఎకరాల్లో నిర్మాణం
త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ప్లాన్‌ను పరిశీలించి సమీక్షించిన మంత్రి తుమ్మల
పరిశీలించిన మంత్రి తుమ్మల
మాస్టర్ ప్లాన్ పరిశీలన సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో, అన్ని మౌలిక సదుపాయాలతో భవనాలు నిర్మించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా అద్భుతంగా ప్లాన్ రూపొందించాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులకు అసౌకర్యం ఎదురుకాకుండా విశాలమైన తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయాలు నిర్మించాలని సూచించారు. డిజైన్లను సీఎం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించాక ఆమోదం తీసుకోవాలని తెలిపారు. కాగా, సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చాక ప్రారంభ వేడుక నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.
మూడేళ్లలో భవనాలు పూర్తి
డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించడానికి ముందే కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌తో మంత్రి తుమ్మల మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాల్లో తాత్కలికంగా తరగతులు నిర్వహించాలని, హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రానున్న మూడేళ్లలో యూనివర్సిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. కాగా, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశంలోనే మొదటిదని.. ఇది తెలంగాణకే కాక దేశానికే తలమానికంగా నిలిచేలా ఆకర్షణీయమైన డిజైన్లతో నిర్మించాలని సూచించారు. 300 ఎకరాల్లో ఏర్పాటయ్యే యూనివర్సిటీ అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. యూనివర్సిటీ ద్వారా వేలాది మంది యువ శాస్త్రవేత్తల భవిష్యత్‌కు బాటలు వేసే అవకా శం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌కు సంబంఽధించిన 380 ఎకరాల స్థలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్లాన్‌ను రూపొందించారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల భవనం, మెడికల్ కాలేజీలను కలుపుతూనే భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా డిజైన్ చేశారు. భద్రాచలం – కొత్తగూడెం ప్రధాన రహదారి నుంచి యూనివర్సిటీ క్యాంపస్‌లోకి వెళ్లగానే తొలుత వచ్చే క్వార్టర్లు, ఉమెన్స్ హాస్టల్, అడ్మినిస్ట్రేషన్ భవనాలను అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, ప్రస్తుతం శిథిలమైన ఆడిటోరియం, ఆ పరిసరాలను స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేసేలా ప్లాన్‌లో పొందుపరిచారు. ప్రస్తుతం ఉన్న కొత్త బాయ్స్ హాస్టల్ అలాగే కొనసాగనుంది. అయితే 1980వ దశకంలో నిర్మించిన పాత హాస్టల్ వద్దే యూని వర్సిటీ నూతన నిర్మాణాలు చేపడుతారు. ఇక్కడ నాలుగు అకడమిక్ బ్లాక్‌లు, సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్, క్యాంటిన్, లైబ్రరీ భవన నిర్మాణాలను ప్లాన్‌లో పొందుపరిచారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు పక్కన బాయ్స్ హాస్టళ్లు, డైనింగ్ హాల్, అకడమిక్ భవనాలకు సమీపాన గర్ల్స్ హాస్టల్, డైనింగ్ హాల్ నిర్మిస్తారు. గర్ల్స్ హాస్టల్ భవనాల పక్కన మెడికల్ కాలేజీ ప్రాంగణం ఉంది. ఇక బాయ్స్ హాస్టల్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రస్తుతం పార్కింగ్ కోసం కేటాయించి.. భవిష్యత్‌లో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఉపయోగించనున్నారు.
తెలంగాణ ఖ్యాతిని పెంచేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ