
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి
అంగన్‌వాడీ కేంద్రాల్లో
పిల్లలకు పోషకాహారం
‘పనుల జాతర’లో కలెక్టర్ జితేష్ పాటిల్, ఎమ్మెల్యే పాయం
పినపాక: ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో నష్టాలు ఎదురవుతున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని.. ఇందులో మునగ సాగుతో లాభాలు ఉంటాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మండలంలోని సీతారాంపురంలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్‌వాడీ కేంద్రం భవనానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ‘పనుల జాతర’లో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, మహిళా సంఘాల సభ్యులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తూ కోళ్ల ఫారాలు, చేపలు, గేదెల పెంపకం చేపట్టాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తూనే పౌష్టికాహారం అందిస్తున్నందున చిన్నారులను చేర్పించాలని సూచించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఏడీఏ తాతారావు, పినపాక, మణుగూరు తహసీల్దార్లు గోపాలకృష్ణ, అద్దంకి నరేష్, ఎంపీడీఓ సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ వినీత తదితరులు పాల్గొన్నారు.
ఉజ్వల భవిష్యత్ కోసం నాణ్యమైన విద్య
మణుగూరు రూరల్: విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేలా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. మణుగూరులోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల, బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, వసతిగృహాలను తనిఖీ చేసిన కలెక్టర్ తరగతి గదులు, భోజనశాల, సామగ్రిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు బోధించడమే కాక వారి ఆరోగ్యంపైనా ఉపాధ్యాయులు శ్రద్ధ కనబర్చాలన్నారు. వంట విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎంఈఓ స్వర్ణజ్యోతి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి