
వ్యక్తి ఆత్మహత్య
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని జగదీశ్‌కాలనీకి చెందిన మణికంఠ శుక్రవారం ఆత్మహత్య చేసున్నాడు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉరివేసుకొని యువకుడు ..
కొత్తగూడెంఅర్బన్: వేధింపు లు తాళలేక ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డా డు. లక్ష్మీదేవిపల్లి పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బంగారుచెలక గ్రామపంచాయతీ పరిధి పాత బంగారు చెలక గ్రామానికి చెందిన కోడిరెక్కల సుధీర్ (24)ను వివాహేతర సంబంధం విషయమైన అదే గ్రామానికి చెందిన కొందరు వేధింపులకు ప్పాలడుతున్నారు. మనస్తాపం చెందిన సుధీర్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నోట్ ఆధారంగా లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గృహోపకరణాలు దగ్ధం
పాల్వంచరూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గృహోపకరణాలు దగ్ధమైన ఘటన పునుకుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పునుకుల గ్రామంలోని వల్లపు శ్యామెయిల్ ఇంట్లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగాయి. టీవీ, దుస్తులు, వంటసామగ్రి, రూ.45వేల నగదు, ఫ్యాన్లు, వంట సరుకులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూరల్ ఆర్‌ఐ అనిల్‌కుమార్ అగ్నిప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య