
హెచ్‌ఎంలుగా అక్కాచెల్లెళ్లు!
ఖమ్మం సహకారనగర్: ప్రభు త్వ ఉపాధ్యాయుల(ఎస్‌ఏ)కు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి అక్కాచెల్లెళ్లకు ఒకేసారి పదోన్నతి రావడం విశేషం. అయితే, వీరిద్దరూ ఒకేసారి ఉపాధ్యాయులుగా విధుల్లో చేరడం, ఆపై ఎస్‌ఏలుగా పదోన్నతి పొందగా ఇప్పుడు ఒకేరోజు హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి పొందడంపై పలువురు అభినందించారు. అక్క చావా ఉషారాణి, చెల్లె చావా దుర్గాభవాని 1993 జూన్ 14న ఎస్‌జీటీలుగా ఖమ్మం అర్బన్ యూపీఎస్, ఖమ్మం జీహెచ్‌ఎస్ మోమినాన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆతర్వాత స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది ప్రస్తుతం కూసుమంచి మండలం నేలపట్ల, చింతకాని మండలం నేరడ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరు శుక్రవారం గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందగా, దుర్గాభవాని ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో, నయాబజార్ పాఠశాలలో ఉషారాణిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరిని ఉపాధ్యాయులు, ఉద్యోగులు అభినందించారు.
ఒకేసారి ఇద్దరికి పదోన్నతి

హెచ్‌ఎంలుగా అక్కాచెల్లెళ్లు!