
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలతో మండలంలోని కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. కిన్నెరసాని రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా, ఎగువ నుంచి 600 క్యూసెక్కుల వరద వస్తుండడంతో శుక్రవారం నీటిమట్టం 404.90 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.