
ఫీవర్ సర్వే నిర్వహించాలి..
బూర్గంపాడు: గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరపీడితులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖ అధికారి సైదులు వైద్యసిబ్బందిని ఆదేశించారు. మోరంపల్లిబంజర పీహెచ్‌సీని, బూర్గంపాడు సీహెచ్‌సీని, నాగినేనిప్రోలు హెల్త్ సబ్‌సెంటర్‌ను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడా రు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలపై ప్రజల్లో చైత న్యం తీసుకురావాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని పేర్కొన్నారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైద్యసిబ్బంది, వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చైతన్య, హెల్త్ ఆఫీసర్, లింగనాయక్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ డీఎంహెచ్‌ఓ సైదులు