
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
అశ్వారావుపేటరూరల్: గుండెపోటు తో ఐటీడీఏ పాఠశాల ఉపాధ్యాయు డు మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బండారిగుంపులోని గిరిజన ప్రాథమిక పాఠశాల (జీపీఎస్) లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దారబోయిన ప్రసాద్ (35) మంగళవారం విధులు ముగించుకుని స్వగ్రామమైన అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, యూటీఎఫ్ నాయ కులు మడివి కృష్ణారావు, కొర్రి వెంకటేశ్, కె.హరినాథ్, నాగరాజు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఒంటరితనం భరించలేక ఆత్మహత్య
పాల్వంచ: ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం శ్రీనివాసనగర్‌కు చెందిన సుగ్గాల వెంకటసాయిరామ్ (36) శాసీ్త్రరోడ్‌లోని పద్మజ ఫ్యాన్సీలో వర్కర్‌గా ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. గట్టాయిగూడెంలో అద్దెకు ఉంటున్నాడు. అతని తల్లి చిన్నప్పుడే చనిపోగా, తండ్రి అనారోగ్యంతో మూడేళ్ల కిందట చనిపోయాడు. ఒంటరితనంతో మానసికంగా కృంగిపోయాడు. గత 15వ తేదీన ఆరోగ్యం బాగోలేదని దుకాణానికి రానని చెప్పాడు. బుధవారం తాను ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తలుపులు తీసి చూడగా, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఒంటరితనం భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని బంధువు మహిపతి లవరావు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని
వ్యక్తి శవం లభ్యం
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియ ని వ్యక్తి మృతదేహం దొరకగా టౌ న్ సీఐ నాగరాజు బుధవారం వివరాలు వెల్లడించారు. బస్టాండ్‌లో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. మృతుడు కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భిక్షాటన చేసినట్లు స్థానికులు తెలిపారు. తెలుపు, ఎరుపు నిలువు గీతలు కలిగిన ఆకుపచ్చ రంగు చొక్కా, నీలం, ఆకుపచ్చ రంగు గల శాలువా ధరించాడని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మార్చురీలో ఉంచామని, సంబంధీకులెవరైనా ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా 87126 82106 నంబర్‌లో సంప్రదించాలని టౌన్ సీఐ నాగరాజు కోరారు.
వ్యక్తి ఆత్మహత్యపై కేసు
చండ్రుగొండ: మండలంలోని రావికంపాడు గ్రామానికి చెందిన మోడెం వెంకటేశ్వర్లు (55) పురుగులమందు తాగి ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా పోలీసులు బుధవా రం కేసు నమోదు చేశారు. రావికంపాడుకు చెందిన వెంకటేశ్వర్లు ఈ నెల 11న మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం పురుగులమందు తాగగా అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు కొత్తగూడెం, ఖమ్మం అనంతరం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు. మృతుడి సోద రుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి