
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ట్రెయినీ కలెక్టర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా కార్యాలయాన్ని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ సోమవారం సందర్శించారు. డీఎంహెచ్‌ఓ ఎస్.జయలక్ష్మి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఆయన వారం రోజుల వరకు డీఎంహెచ్‌ఓ కార్యాలయ పనులను పరిశీలించనున్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు మధువరన్, పి.స్పందన, సుకృత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫైజ్ మొహియునద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటా ఎంత?
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర పన్నుల నికర ఆదాయంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎంత..? అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాలకు వాటాపై 15వ ఆర్థిక సంఘం సూచన, ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణ స్థాయి, రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్ల వివరాలను తెలపాల్సిందిగా కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రాల వాటా రూ. 12.86 లక్షల కోట్లు. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నులు, సుంకాల నికర ఆదాయంలో రాష్ట్రాల వాటా మొత్తం రూ.12,86,885.44 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 41 శాతం తక్కువగా ఉందా..? అని ఎంపీ ప్రశ్నించగా 15వ ఆర్థిక సంఘం ఆమోదించిన సిఫార్సుల ప్రకారం ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం నేరుగా ఎలాంటి పన్ను కేటాయించలేదని తెలిపారు.
రామకృష్ణాపురం
రైల్వే బ్రిడ్జిపై కదలిక..
ఖమ్మంవైరారోడ్: చింతకాని మండలం రామకృష్ణాపురం 107 రైలు క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణంపై కదలిక వచ్చింది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు తెలిపారు. ఈ మేరకు ఎంపీ రవిచంద్ర ఆగస్టు 7వ తేదీన రైల్వే మంత్రికి రాసిన లేఖలో రామకృష్ణాపురం గ్రామ సమీపంలోని 107 లెవల్ క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. తరచూ గేటు మూసి ఉంచడం వల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ ఎంపీ రవిచంద్రకు తిరిగి లేఖ రాశారు. చింతకాని మండలం రామకృష్ణాపురం 107 లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణం కోరుతూ చేసిన వినతిపై సాధ్యాసాధ్యాలకు సంబంధించి సమగ్ర నివేదిక కోరుతూ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు.
దాడి చేసినవారిపై
కేసు
ములకలపల్లి: తన కొడుకుపై దాడి చేశారంటూ మంగపేట గ్రామానికి చెందిన సడియం వీరభద్రం ఫిర్యాదు చేయగా సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. మంగపేట గ్రామానికి చెందిన సడియం శివ ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా తండ్రి వీరభద్రం ప్రశ్నించాడు. తన స్నేహితులు వాడే శ్రీను, మడివి జంపన్న, వర్సా చరణ్ పిలిచారని, అందుకే వెళ్తున్నట్లు తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత శివ ఒంటిపై గాయాలతో ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందని అడుగగా.. శ్రీను సోదరికి ఫోన్లో మేసేజ్ చేస్తున్నానని ఆరోపిస్తూ దాడి చేశారని చెప్పాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లారీడ్రైవర్‌ను మోసగించిన సైబర్ దుండగులు
ఖమ్మంఅర్బన్: రెట్టింపు లాభం వస్తుందని నమ్మించి లారీడ్రైవర్ నుంచి రూ.83,940ను కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలి) పోలీస్‌స్టేషన్లో సోమవారం సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. సీఐ భానుప్రకాశ్ కథనంప్రకారం..నగరంలోని శ్రీరాంనగర్‌కు చెం దిన షేక్‌జానీహుస్సేన్‌లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నా డు.‘పెట్టుబడి పెడితే రెట్టింపులాభం వస్తుంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనను నమ్మి, మిత్రుడి సూచన మేరకు గత జూలై 23, 24 తేదీల్లో రూ.83,940 వివిధ దపాలుగా చెల్లించాడు. తర్వాత సంబంధిత ఖాతా బ్లాక్ అవడంతో మోసపోయానని సైబర్ క్రైమ్ నంబర్ 1930కి ఫిర్యాదు చేశాడు. వెంటనే రూ.18 వేలు డ్రా కాకుండా నిలువరించారు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.