కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకురావచ్చు.
సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్‌ఈ
సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా అన్నమయ్య జిల్లా వినియోగదారులు 9440817449 నంబర్‌కు వైఎస్సార్ జిల్లా వినియోగదారులు 08562242457 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
రైతులకు అందుబాటులో ఎరువులు
సాక్షి, మదనపల్లె : జిల్లాలో రైతులకు అవసరమైనంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత, పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 20,860 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 23,015 మంది రైతులకు యాప్ ద్వారా 45,403 బస్తాల యూరియా, 4,445 బస్తాల డీఏపీ విక్రయించినట్టు తెలిపారు. మిగిలిన నిల్వలు ఆగస్టు చివరి వరకు జిల్లా అవసరాలకు సరిపోతాయని తెలిపారు.
పక్కాగా ప్రశస్త్ 2.0 స్క్రీనింగ్
మదనపల్లె సిటీ : జిల్లాలో ప్రత్యేక అవసరాల విద్యార్థులను ముందస్తుగా గుర్తించి, వారికి అవసరమైన విద్యా,వైద్య, పునరావాస సేవలను అందించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రశస్త్ 2.0 స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు డీఈఓ సుబ్రమణ్యం సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి చదువతున్న విద్యార్థులందరికీ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జులై 31లోపు ప్రశస్త్ 2.0 యాప్‌లోని శిక్షణ వీడియోలను పూర్తిగా వీక్షించాలని, అలాగే ఆగస్టు 15లోపు యూడైస్ వివరాలను నవీకరించాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్ట్–1 స్క్రీనింగ్ , అనంతరం ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా పార్ట్–2 స్క్రీనింగ్ చేపట్టి, గుర్తించిన ప్రతి విద్యారికి ఇండివిడ్యువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు.
నేడు షైనింగ్ స్టార్స్
అవార్డుల ప్రదానం
మదనపల్లె సిటీ : జిల్లా వ్యాప్తంగా గతేడాది పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవా రం షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక ఎన్‌జీఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జనార్థన్‌రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్‌రెడ్డిలు విద్యార్థులకు అవార్డులు అందజేస్తారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.20 వేలు నగదు, పతకం, అందజేస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 188 ముంది విద్యార్థులను ఎంపిక చేశామని వివరించారు.
మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం
రాయచోటి: ఏపీఎన్‌జీఓస్ అసోసియేషన్ అనుబంధ సంఘం ‘తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్’ అన్నమ య్య జిల్లా కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం రాయచోటి ఎన్జీఓ హోమ్‌లో ఏపీ ఎన్‌జీఓస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్ష, కార్యవర్గ ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాజేంద్ర, సహాధ్యక్షులు పి రమణమ్మ, ఉపాధ్యక్షులుగా నీలిమ, సావిత్రి, అంజమ్మ, రఘునాథ్ నాయక్, పార్వతమ్మ, అమరను ఎన్నుకున్నారు. వీరితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఎన్‌జీఓ నాయకులు శివారెడ్డి, మహదేవ, రాజశేఖర్ రెడ్డి, ప్రతిభాకుమారి పాల్గొన్నారు.


