ఇతని పేరు పాలెం వెంకట్రమణ. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇతను భూ సమస్య పరిష్కారం కోసం పీజీఆర్‌ఎస్‌లో 11 సార్లు అర్జీ ఇచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.ఇతనికి తంబళ్లపల్లి మండలం రేణిమాకులపల్లిలో సర్వే నంబర్ 144/2లో ఎకరా 85 సెంట్ల డీకేటీ భూమి ఉంది. పట్టా కూడా ఉంది. ఇప్పటికీ ఇతని అనుభవంలోనే ఉంది.వన్‌బీ కోసం దరఖాస్తు చేయగా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇదే భూమికి మరో ఫోర్జరీ పట్టా పొందిన వ్యక్తి వైపు రెవెన్యూ అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఇది ఫోర్జరీ పట్టా అని అధికారుల విచారణలో వెల్లడైనా తనకు న్యాయం చేయడం లేదని వృద్ధుడు వాపోతున్నారు. మరోసారి పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు.


