కృషి,పట్టుదలతో ఏదైనా సాధ్యమే
సినీనటి శ్రీదేవిని సత్కరిస్తున్న ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి, ఏయూ వార్షికోత్సవ సభకు హాజరైన వేలాది మంది విద్యార్ధులు
రాజంపేట: సాధారణ నేపథ్యం నుంచి సినీపరిశ్రమలో నటిగా స్థిరపడ్డానంటే సవాళ్లను ఎదుర్కొవడంతో పాటు, కృషి, పట్టుదల కారణమని ప్రముఖ సినీనటి శ్రీదేవి అప్పల అన్నారు. గురు వారం రాత్రి అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవంలో భాగంగా క్రీడా–సాంస్కృతిక దినోత్సవం సభకు ఆమె ముఖ్యఅతిఽథిగా హాజరై ప్రసంగించారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకుని నిరంతర శ్రమ,క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో మందుకు సాగితే ఏ రంగాలోనైనా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై స్పష్టతతో ముందుకుసాగుతూ, తమలోని నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ , నాయకత్వ లక్షణాలు జీవిత విజయానికి కీలకమని వివరించారు. ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఇందుకు అన్నమాచార్య యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైనబోధన, అధునాతన సౌకర్యాలను కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారకీ కార్యక్రమంలో ఏఈటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, వీసీ సాయిబాబారెడ్డి, రిజిస్ట్రార్ మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ నారాయణ, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు డాక్టర్ బి.జయరామిరెడ్డి, డాక్టర్ ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో , ఆటలలో విజేతలైన వారికి సినీనటి శ్రీదేవి బహుమతులను అందచేశారు. విద్యార్థులు భారతీయ జ్ఞాన కేంద్రం భావనను ప్రతిబింబించే నృత్యాలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ, జానపద నృత్యాల ప్రదర్శనతో అలరించారు.
ఏయూ వార్షికోత్సవ వేడుకసభలో
సినీనటి శ్రీదేవి అప్పల
కృషి,పట్టుదలతో ఏదైనా సాధ్యమే


