హుండీ ఆదాయం రూ.49.14లక్షలు | - | Sakshi
Sakshi News home page

హుండీ ఆదాయం రూ.49.14లక్షలు

Jan 9 2026 7:27 AM | Updated on Jan 9 2026 7:27 AM

హుండీ

హుండీ ఆదాయం రూ.49.14లక్షలు

హుండీ ఆదాయం రూ.49.14లక్షలు 11 నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు నేడు ‘సిద్దవటం’ వర్ధంతి సభ కుక్కలదాడిలో పునుగుపిల్లి మృతి

చౌడేపల్లె: ప్రముఖ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా రూ.49.14లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఇందులో బంగారం 19గ్రాములు , వెండి 292 గ్రాములు సమకూరినట్లు పేర్కొన్నారు. వీదేశీ కరెన్సీ నోట్లతోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.28,943 నగదు లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం31 రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమీషనర్‌ చిట్టెమ్మ, ఆలయ, ఏపీజీ బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మదనపల్లె సిటీ: కేంద్రీయ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11 నుంచి హాల్‌టిక్కెట్లు పొందవచ్చునని మదనపల్లె జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్‌ ఎం.గీత ఓ ప్రకటనలో తెలిపారు. హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్య వున్నా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ మరచిపోయినా హెల్ప్‌డెస్క్‌ 89199 56395, 80743 05048కు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్ష 7.2.2026న (శనివారం) జరుగుతుందని తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 11వ తరగతికి మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎ,బి కేంద్రాలు, 9వ తరగతికి మదనపల్లె హోప్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, జవహర్‌ నవోదయ విద్యాలయ, వలసపల్లెలో పరీక్షలు నిర్వహణ ఉంటుందని వివరించారు. పరీక్షలు ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ హుండీ ఆదాయం పెరిగింది. గురువారం ఆలయ టీటీడీ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 9 నుంచి జనవరి 8వ లేది వరకు శ్రీరాముడిని దర్శించుకున్న భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను లెక్కించగా రూ. 10,15,154 వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆలయ రంగమండపంలో ఈ లెక్కింపు జరిగింది. గత నెల రూ. 5,91,855 రాగా ప్రస్తుతం రూ.4,23,299 పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లా పర్యాటకరంగ ప్రముఖులు సిద్దవటం సీతారామయ్య వర్ధంతి కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు నగరంలోని సాయిబాబా థియేటర్‌ సమీపంలోని గ్రాండ్‌ ఇన్‌ హోటల్‌లో నిర్వహించనున్నట్లు కొండూరు జనార్దన్‌రాజు తెలిపారు.

రాజంపేట: రాజంపేట తహసీల్దారు కార్యాలయం ఆవరణలో కుక్కలదాడిలో పునుగుపిల్లి మృత్యువాతకు గురైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన వన్యప్రాణిగా గుర్తించబడిన పునుగుపిల్లి పట్టణ ప్రాంతానికి ఎలా వచ్చిందో అన్న అనుమానాలు తలెత్తాయి. అటవీ అధికారులకు సమాచారం రాగానే పునుగుపల్లి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట పశుసంవర్దకశాఖ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీ ప్రాంతంలో దహనం చేశారు. శేషాచలం అటవీ ప్రాంతానికి పరిమితమైన పునుగుపిల్ల జననివాసాల్లోకి కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

హుండీ ఆదాయం రూ.49.14లక్షలు 1
1/2

హుండీ ఆదాయం రూ.49.14లక్షలు

హుండీ ఆదాయం రూ.49.14లక్షలు 2
2/2

హుండీ ఆదాయం రూ.49.14లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement