సేంద్రియ వ్యవసాయంతో బహుళ ప్రయోజనాలు
● జేడీఏ శివనారాయణ
కేవీపల్లె: సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా రైతులు బహుళ ప్రయోజనాలు పొందవచ్చని జేడీఏ శివనారాయణ అన్నారు. గురువారం మండలంలోని వగళ్ల, తిమ్మాపురం గ్రామ పంచాయతీలలో పర్యటించి వివిధ రకాల పంటలను పరిశీలించారు. వగళ్లలో వర్మీకంపోస్టు యూనిట్‌ను పరిశీలించారు. వేరుశెనగ పొలాన్ని పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. తిమ్మాపురం పంచాయతీ చిన్నకమ్మపల్లెలో డ్రమ్ సీడర్ పద్ధతిలో వరిసాగు చేస్తున్న పొలంను పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీఏ రైతులకు పలు సూచనలు చేశారు. స్థానికంగా వ్యవసాయ సిబ్బంది ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏవో మాధవి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీ ఎస్‌ఎస్‌డీసీ, జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని జొయలుక్కాస్ జ్యువెలరీలో ప్రముఖ కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివి 19–30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థి విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలు, ఫొటోలు తీసు కుని ఇంటర్వ్యూకు రావాల్సి ఉంటుందన్నారు.


