క్యూ ఆర్ కోడ్‌తో సులభంగా భూ వివరాలు
కలెక్టర్ నిశాంత్‌కుమార్
కలకడ: క్యూ ఆర్‌కోడ్ పట్టాదారు పాస్‌బుక్కు ద్వారా భూ యజమాని, భూమి వివరాలను సులభంగా తెలుకోవచ్చునని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలకడ మండలంలోని దేవులపల్లె గ్రామం సచివాలయంలో నిర్వహించిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్‌బుక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతికతద్వారా భూ వివాదాలను సులువుగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూగ్రామ సభ లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులను పట్టాదారు పాస్‌బుక్కుల నమోదులో తప్పులు ఉంటే ఆధార్‌నెంబర్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలలో తప్పులు దొర్లితే వెంటనే పరిష్కరించాలని మండల తహసీల్దార్ మహేశ్వరిభాయ్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఓలు, సర్వేయర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


