మదనపల్లెకు పతకాల పంట
మదనపల్లె: జాతీయ స్థాయి స్కయ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో మదనపల్లె విద్యార్థులు అద్భు త ప్రతిభ చూపించారు. ఈ వివరాలను చైర్మన్ ఇస్మాయిల్, కోచ్ ఖాదర్ బాషా గురువారం వెల్లడించారు. 26వ జాతీయ స్థాయి స్కయ్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు జనవరి 5 నుంచి 7 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం జరిగాయి. ఈ పోటీలకు ఏపీ నుంచి 94 మంది విద్యార్థులు పాల్గొంటే అందులో 24 మంది మదనపల్లె విద్యార్థులే కావడం విశేషం. ఇందులో 15 మంది బంగారు పతకాలు, ఆరు గురు రజత పతకాలు, 16 మంది కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. మెడల్ సాధించిన విద్యార్థులను స్కయ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఇబ్రహీం, చైర్ పర్సన్ ఇస్మాయిల్ అభినందించారు.


