​​​​​​​రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

​​​​​​​రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Aug 2 2023 6:56 AM | Updated on Aug 2 2023 12:19 PM

- - Sakshi

బైపాస్‌ రోడ్డు దాటుతుండగా రాజంపేట నుంచి రేణిగుంటవైపు వెళ్తున్న లాజిస్టిక్‌ లారీ ఢీకొంది.

అన్నమయ్య: పట్టణ పరిధిలోని చిట్వేలి బైపాస్‌ రోడ్డు వద్ద మంగళవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఉదయ్‌కిరణ్‌(15) అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మండలంలోని ఎస్‌.కొత్తపల్లికి చెందిన రోజువారీ కూలీలైన తిరుమలేశు, రాజేశ్వరిలకు ముగ్గురు కుమారులు. తల్లిదండ్రులు తమ ముగ్గురు బిడ్డల్ని పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు.

పెద్ద కొడుకు ఉదయ్‌కిరణ్‌ పదో తరగతి చదవుతున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు చిట్వేలి బైపాస్‌ రోడ్డు దాటుతుండగా రాజంపేట నుంచి రేణిగుంటవైపు వెళ్తున్న లాజిస్టిక్‌ లారీ ఢీకొంది. దీంతో ఉదయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement