హార్టికల్చర్‌ హబ్‌కు భూముల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

హార్టికల్చర్‌ హబ్‌కు భూముల పరిశీలన

Jul 28 2026 1:54 AM | Updated on Jul 28 2026 1:54 AM

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఉండాలి

● 90 శాతం పనులు పూర్తయినా కాలయాపన

1.6 కి.మీ. పైప్‌లైన్‌ వేయని సర్కార్‌

ఎండిపోయిన మున్సిపల్‌ బోర్లు

సాక్షి, మదనపల్లె: నిత్యం కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని, అడుగంటిన భూగర్భ జలాలతో తల్లడిల్లే మదనపల్లె పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి విజన్‌కు ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చంద్రగ్రహణంలా చుట్టుకుంది. నాటి ప్రతిపక్ష నేతగా మదనపల్లె ప్రజల నీటి కష్టాలను కళ్లారా చూసిన వైఎస్సార్‌.. 2004లో ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాంత దాహార్తిని తీర్చడానికి అపర భగీరథుడిలా ప్రణాళికలు రచించారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా మదనపల్లె పట్టణానికి కృష్ణా జలాలను తరలించే బృహత్తర కార్యాన్ని భుజానికెత్తుకున్నారు. 2005– 2009 మధ్యకాలంలోనే 59వ ప్యాకేజీ పరిధిలో చిప్పిలి (0.08 టీఎంసీ), గుంటివారిపల్లి(0.131 టీఎంసీ) సమ్మర్‌ స్టోరేజ్‌ (ఎస్‌ఎస్‌) ట్యాంకులు, నీటి శుద్ధి ప్లాంటు (ఫిల్టర్‌ బెడ్స్‌) నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తి చేసి పరుగులెత్తించారు. కానీ, వైఎస్సార్‌ మరణానంతరం వచ్చిన చంద్రబాబు హయామంతా ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ప్రదర్శించడంతో మదనపల్లె ప్రజలకు నీటి కష్టాలు శాపంగా మారాయి.

కుప్పంపై ఉన్న ప్రేమ.. మదనపల్లైపె లేదు!

గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి వరకు కృష్ణా జలాలను హంద్రీనీవా పుంగనూరు ఉప కాలువలోకి పారించారు. చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి దాదాపు ఆరు టీఎంసీల నీటిని అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మీదుగా సాగే పుంగనూరు ఉపకాలువ ద్వారా చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి తరలించుకుపోయారు. కుప్పంలోని చెరువులు, కాలువలను నింపుకునేందుకు చూపిన శ్రద్ధ, ఆ కాలువ పక్కనే ఉన్న మదనపల్లె సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నింపడంపై చంద్రబాబుకు కలగలేదు. మదనపల్లె పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలన్న కనికరం కూడా చూపకుండా ట్యాంకులను నిలువునా ఎండబెట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును కృష్ణా జలాలతో నిండుగా నింపగా.. ప్రస్తుత కూట మి ప్రభుత్వం తాము కూడా నీళ్లిచ్చామని కేవలం బోర్డులు చెప్పుకోవడానికి కొద్దిపాటి నీటిని మళ్లించి చేతులు దులుపుకుంది. ఆ నీరు కనీసం దేనికీ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.

1.6 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేయలేక ..

చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిండుగా ఉంటే చుట్టుపక్కల భూగర్భ జలాలు అద్భుతంగా వృద్ధి చెందుతాయి. అయితే, చిప్పిలి ట్యాంక్‌ నుంచి సమీపంలోని గుట్టపైకి నిర్మించాల్సిన కేవలం 1.6 కిలోమీటర్ల పైప్‌లైన్‌, ఇన్‌టెక్‌ బావి నిర్మాణ పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం పనులు చేపట్టే అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, ఇప్పటిదాకా ‘ప్రతిపాదనలు, డిజైన్లు’ చేస్తున్నారన్న సాకుతో కాలం గడిపేస్తున్నారు తప్ప పనులు ముందుకు కదలడం లేదు. ఫలితంగా కోట్ల రూపాయల ప్రజాధనంతో వైఎస్సార్‌ నిర్మించిన ఆస్తులు వృధాగా పడి ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య అనే మాటే వినబడేది కాదు.

ఇప్పుడు దాహం కేకలు:

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను సక్రమంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఉంటే మదనపల్లె పట్టణంలో నీటి సమస్య అనే మాటే వినిపించేది కాదు. పాలకులు చేసిన పాపానికి ఇప్పుడు పట్టణంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారమే పట్టణంలో ఏకంగా 59 మున్సిపల్‌ బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో ప్రజల దాహం కేకలను ఆసరాగా చేసుకుని కూటమి నేతలు ‘ప్రైవేట్‌ ట్యాంకర్ల దందా’కు తెరలేపారు. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి మున్సిపల్‌ సంపులకు తరలిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల అసలు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాల్సిన అవసరమే రాలేదు. కానీ ఇప్పుడు ట్యాంకర్ల కొనుగోళ్ల వల్ల మున్సిపల్‌ ఖజానాకు భారీగా గండి పడుతోంది. పట్టణ అభివృద్ధి కోసం, రోడ్లు, డ్రైనేజీల కోసం ఖర్చు చేయాల్సిన ప్రజల పన్నుల డబ్బులను కాస్తా.. ఇప్పుడు ట్యాంకర్ల బిల్లుల రూపంలో ప్రైవేట్‌ వ్యక్తుల జేబుల్లోకి మళ్లిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కాలయాపన ఆపి, చిప్పిలి మిగులు పనులను పూర్తి చేసి కృష్ణా జలాలతో మదనపల్లె దాహం తీర్చాలని పట్టణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

పెద్దతిప్పసముద్రం: మండలంలోని పట్టెంవాండ్లపల్లి సమీపంలోని ఒకటో నంబర్‌ సర్వేలోని వ్యాసరాజ మఠం భూములను సోమవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పరిశీలించారు. సదరు సర్వే నంబర్‌లో 727 ఎకరాల భూములు ఉండగా రైతులకు కేటాయించిన భూములు పోగా 500 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి. కాగా వ్యాసరాజ మఠం భూములకు సంబంధించి క్రయ, విక్రయాలు జరిగినా తమకు వన్‌బీ, అడంగల్‌ రాలేదని పలువురు రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, తహశీల్దార్‌ శ్రీరాములు నాయక్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, మండల సర్వేయర్‌ శ్రీవాణి, ఆర్‌ఐ హుస్సేన్‌, వీఆర్వో శేఖర్‌ తదితరులు ఉన్నారు.

రాయచోటి : ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీలలో భాగంగా సోమవారం రాయచోటి మార్కెట్‌ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ తనిఖీ చేశారు. వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్‌ సమాధానం ఇచ్చారు.

వైఎస్సార్‌ తెచ్చిన భాగీరథి

బాబుతో అధోగతి

వృధాగా నీటి శుద్ధి ప్లాంటు

చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు సమీపంలో ముట్టపై నీటి శుద్ధి ప్లాంటును నిర్మించారు. 15 ఏళ్లుగా ఈ ప్లాంట్‌ వృథాగా ఉంది. యంత్రాలు, పరికరాల నిర్వహణ లేకపోవడంతో తిరిగి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి నీటిని తరలించేందుకు చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ వద్ద ఇంటెక్‌ నుంచి 1.6 కిలోమీటర్ల పైప్‌ లైన్‌ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు టెండర్లు పూర్తి చేసినప్పటికీ డిజైన్లు అప్రూవల్‌ కాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement