సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలను ఎదుర్కోవడం చంద్రబాబుకు చేతకాదు అంటూ ఆయనపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరాచకాలు ఎక్కువ కాలం సాగవని హెచ్చరించారు. అలాగే, పోలీసులను అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో కూటమి గెలిచిందని చెప్పుకొచ్చారు. అలాగే, ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది.. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని పరామర్శించడానికి వైఎస్సార్‌సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలశిల రఘురాం, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు, పలువురు నేతలు గుంటూరు జిల్లా జైలుకు వెళ్లారు. ములాఖత్ ద్వారా లేళ్ళ అప్పిరెడ్డిని పరామర్శించారు. అనంతరం, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసులు, కూటమి నేతలు చట్టాన్ని దుర్వినియోగం చేశారు. అబద్దాలు చెప్పి ఎన్నికల్లో కూటమి గెలిచింది. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?. బ్యాలెట్ బాక్స్‌ను అక్రమంగా తీసుకెళ్లే వారిని అరెస్ట్ చేయకుండా అక్రమాలను అడ్డుకున్న అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో కూటమి గెలిచింది. పోలీసులు, కూటమి నేతలు చట్టాన్ని దుర్వినియోగం చేశారు. పోలింగ్ బూత్ దగ్గరే కూటమి నేతలు డ్రామాలు మొదలు పెట్టారు.

పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి నేతలు అరాచకాలు చేస్తున్నారు. పోలీసుల బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడరు. భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం. రానున్న రోజుల్లో కూటమి నేతలకు చట్టపరంగా శిక్ష తప్పదు. గతంలో ఈవీఎంలు, ఇప్పుడు బ్యాలెట్ బాక్స్‌లతో కూటమి అక్రమాలు చేస్తోంది. పులివెందులలో రెండువేల మందికిపైగా అక్రమ కేసులు బనాయించారు. వైఎస్ జగన్ బయటకు వస్తే చంద్రబాబుకు వణుకు’ అని అన్నారు.
ఇదీ చదవండి: పేరుకు జనసేన... పార్టీ మాత్రం టీడీపీ


