ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది | YSRCP Leader Ravi Chandra Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వంపై రాళ్లు..

Jul 27 2020 3:44 PM | Updated on Jul 27 2020 3:51 PM

YSRCP Leader Ravi Chandra Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబు తీరుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో కరోనాతో సెకనుకు ఒకరు చనిపోతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు. రాష్ట్రంలో టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేస్తున్నారు కాబట్టే కేసులు పెరుగుతున్నాయి. తక్కువ టెస్టులు చేస్తే కరోనా వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ధైర్యం నింపాల్సిన సమయంలో ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement