ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై కఠిన చర్యలు తప్పవు!

Anantha Venkatarami Reddy Was Outraged Over Negligence of Doctors - Sakshi

సాక్షి, అనంతపురం: జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి సీరియస్‌‌ అయ్యారు. సోమవారం రోజున అనంతపురం జీజీహెచ్‌లో కరోనా బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులపై చిన్నచూపు తగదు. వైద్యులు మానవతా థృక్పథంతో వ్యవహరించాలి. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా ఎందుకీ నిర్లక్ష్యం...? ప్రభుత్వ వైద్యుల్లో బాధ్యత పెరగాలి.

కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. కరోనా కష్టకాలంలో ప్రైవేటు డాక్టర్ల దోపిడీ తగదు. కరోనా పరీక్షల పేరుతో ఒక్కొ సీటీ స్కాన్‌కు రూ. 5,000 వసూలు చేయటం బాధాకరం. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై కఠిన చర్యలు తప్పవు!. కరోనా బాధితులకు భరోసా ఇవ్వాల్సింది వైద్యులే. కోవిడ్ వారియర్స్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని విధాల అండగా ఉంటారని' ఎమ్మెల్యే అనంత పేర్కొన్నారు.

('కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్')

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top