సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి, చంద్రబాబు నాయుడి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బాబును ప్రశ్నిస్తే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చట్టాన్ని, పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. బాబు తానా అంటే.. ఎల్లో మీడియా తందానా అంటోందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు. SIR పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియ జరుగుతోందన్నారు. హే రామ్.. సేవ్ ఆంధ్రా అని జగన్ వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్..
- కూటమి ప్రభుత్వం రాక ముందు ఏపీలో ప్రజా సంక్షేమం గురించే చర్చ జరిగేది.
- మా హయాంలో సంక్షేమం గురించి చర్చ జరిగింది.
- చంద్రబాబు వచ్చాక రెడ్‌బుక్ అరాచకం, కస్టోడియల్ డెత్స్, హామీల మోసాలపై చర్చ జరుగుతోంది.
- రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు పోయింది.
- పోలీసు స్టేషన్‌లకు పోవాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి.
- బాబును ప్రశ్నిస్తే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
- చంద్రబాబు చేస్తున్న టాపిక్ డైవర్షన్ల మీదనే అంతటా చర్చ జరుగుతోంది.
- న్యాయం, ధర్మం గాడితప్పి వ్యవస్థ దిగజారిపోయింది.
- ఏపీలో రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతోంది.
- చంద్రబాబు దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు.
కూటమి గుప్పిట్లో వ్యవస్థలు..
- సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి వంటి ఘటనలు..
- రాష్ట్రంలో భయానక వాతావరణానికి అద్దం పడుతున్నాయి.
- జర్నలిస్టులు సహా ఎవరు ప్రశ్నించినా అణచివేస్తున్నారు.
- చట్టాన్ని, పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.
- ఎవరూ ఏం చేయలేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
- కస్టడీలోనే చంపి మృతదేహం కూడా మాయం చేశారు.
- కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వలేదు.
- చంద్రబాబు ఇంటికి ఆమడ దూరంలో ఈ ఘటన జరిగింది.
- రాష్ట్ర ప్రజలు నెవ్వెరపోయే ఘటనలు జరుగుతున్నాయి.
- చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదట.
- ప్రశ్నిస్తే ఎల్లో మీడియాతో వ్యక్తిత్వ హననం చేయిస్తారు.
- క్రిమినల్స్‌కు మద్దతిస్తారా అంటూ ఎదురుదాడి చేస్తున్నారు.
- బాబు తానా అంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది.
ఎల్లో మీడియా తందానా..
- రాష్ట్రంలో ఇలాగే అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికారిక ప్రకటన చేయగలరా?.
- సాయికృష్ణను మొదట రౌడీషీటర్ అన్నారు.
- రౌడీషీటర్‌ని వెనకేసుకుని వస్తారా అన్నారు.
- ప్రజల నుంచి ఛీత్కారాలు రావడంతో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
- సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకుని చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు.
- 46 రోజులు సాయికృష్ణ కేసును తొక్కిపెట్టారు.
- బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- చెప్పాల్సిన బాధ్యత సీఎంగా చంద్రబాబుకు లేదా?.
- సాయికృష్ణ రిమాండ్ రిపోర్టు చూస్తే అంతా తెలుస్తుంది.
- పైవాళ్లను ఎలా కాపాడుతున్నారో స్పష్టంగా కనిపిస్తోంది.
- చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా.
- రాష్ట్రంలో ఇలాగే అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికారిక ప్రకటన చేయగలరా??
సీపీ, డీజీపీ బాధ్యులు కారా?
- సీఐని సీపీ కాపాడుతాడు.. సీపీని డీజీపీ కాపాడుతాడు..
- డీజీపీని చంద్రబాబు కాపాడుతారు.
- సీపీ ఆధ్వర్యంలో పనిచేసే టాస్క్‌ఫోర్స్ కృష్ణలంక పీఎస్‌లో సాయికృష్ణను అప్పగించింది.
- సాయికృష్ణ బంధువులు డీజీపీకి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.
- కోర్టులో ప్రవేశపెట్టలేదని అడిగితే సీపీ పట్టించుకోలేదు.
- ఈ ఘటనలన్నీ దిగజారిపోతున్న వ్యవస్థకు అద్దం పడుతున్నాయి.
- మరణ వాంగ్మూలానికి విలువ లేదా?.
- ఒక తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా?.
- కన్న కొడుకు కోసం ఒక తల్లి పడే వేదనకు విలువ లేదు.
- జగన్ వెళ్లిన నాలుగు రోజులకు గానీ అరెస్ట్‌లు జరగలేదు.
- చిన్నచిన్న వాళ్లను అరెస్ట్‌చేశారు.
- జగన్ వెళ్లకపోయి ఉంటే సాయికృష్ణ కేసే ఉండేది కాదు.
- క్రాంతి కుమార్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
- క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా?.
- మరో తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా?.
- మే ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటి వరకు సీసీ ఫుటేజ్ లేదట.
- 18 నెలలుగా సీసీ ఫుటేజ్ తొలగించినట్టు కానిస్టేబుల్ అరెస్ట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
- 18 నెలల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో?.
- సీఐ, సీపీ, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులను చేయవద్దు?.
- ఈ కేసులో చంద్రబాబుకు ఉన్న ఇంట్రస్ట్ ఏంటి?.
- నేరాన్ని కప్పిపెట్టిన సీపీ, డీజీపీ బాధ్యులు కారా?.
డీజీపీ, సీపీ ఫుటేజీ ఏమైంది?..
- పీఎస్‌లో సీసీ ఫుటేజ్ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ ఫుటేజ్ ఏమైంది?.
- డీజీపీ, సీపీ ఫుటేజీ ఏమైంది?.
- విజయవాడ ప్రధాన కూడళ్లలో సీసీ ఫుటేజ్ ఏమైంది?.
- మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకోవచ్చు కదా?.
- సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు?.
- క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుంది.
- క్లౌడ్ సర్వర్లలో ఫుటేజ్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు.
- పోలీసు బాస్‌ల కాల్ రికార్డులు పరిశీలించారా? లేదా?.
- కానిస్టేబుల్స్ ఫోన్లు నాగ్‌పూర్‌లో అమ్మారని పేర్కొన్నారు.
- విజయవాడలో సామన్యుడి పరిస్థితి ఏంటి?.
- హెడ్‌క్వార్టర్లలోనే ఇలా పరిస్థితి ఉంటే.. మిగతా చోట్ల పరిస్థితి ఏంటి?
- మానవ హక్కులకు విలువ ఎక్కడుంది?.
- కోర్టులను తప్పుదోవ పట్టించడం చంద్రబాబకు అలవాటే.
ఆంధ్రలోనే జంగిల్‌రాజ్..
- బాధితులే నిందితులా?.
- చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు.
- రైతుల కోరిక మేరకు అమరావతిలో మా పార్టీ నేతలు పర్యటించారు.
- వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేసి తిరిగి వాళ్లపైనే కేసులు పెడుతున్నారు.
- రాజధాని రైతులంతా ఇటీవల నన్ను కలిశారు.
- మా పార్టీ నేతలపై హత్యాయత్నం చేశారు.
- మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలపై దాడులు చేశారు.
- చంద్రబాబు చేసే దారుణాలపై ప్రశ్నించడం తప్పా?.
- భూమి ఇవ్వని రైతులను భూసేకరణ పేరుతో వేధిస్తున్నారు.
- భూమి ఇవ్వని రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్నారు.
- రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారు.
- కొండవీటి వాగు నీటికి పొలాల్లోకి బలవంతంగా మళ్లించారు.
- విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉన్నారు.
- అమరావతిలో రైతుల తరఫున నిలబడితే నిందితులుగా చిత్రీకరిస్తున్నారు.
- మా పార్టీ నేతలపైనే దాడి చేసి, మాపైనే కేసులు పెడుతున్నారు.
- రైతులకు సంఘీభావం తెలిపిన మా పార్టీ నేతలంతా రౌడీషీటర్లా?.
- పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు.
- రెండేళ్లుగా రెడ్‌బుక్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.
- జంగిల్ రాజ్ ఎక్కడో బీహార్‌లో లేదు.. ఆంధ్రాలోనే కనిపిస్తోంది.
కేంద్రం కళ్లెదుటే అమరావతిలో దోపిడీ..
- చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా రౌడీషీటర్ల ముద్ర వేస్తారు.
- ఎన్టీఆర్ ఉండి బాబును ప్రశ్నించినా రౌడీషీటర్ ముద్ర వేసేవారు.
- ఉండవల్లిలో దాడులు చేసింది టీడీపీ నేతలే.
- పోలీసుల సమక్షంలోనే రాడ్‌లతో దాడులు చేశారు.
- తప్పులు చేసేది మీరు.. కేసులు మాత్రం మాపై పెడుతున్నారు.
- దాడులు చేసిన ఒక్క టీడీపీ నేతను కూడా అరెస్ట్ చేయలేదు.
- రాజధాని రైతులు ఏం తప్పు చేశారు.
- అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు.
- ఇంకా భూములు ఎందుకు అని రైతులు అడుగుతున్నారు.
- బాబు బినామీలకు కట్టబెట్టడానికే మళ్లీ భూసేకరణ.
- కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు చదరపు అడుగుకు రూ.4645గా నిర్ణయించింది.
- అదే చంద్రబాబు మాత్రం సెక్రటేరియట్ కోసం రూ.20439 ఖర్చు చేస్తున్నారు.
- కేంద్రం కళ్లెదుటే అమరావతిలో దోపిడీ జరుగుతోంది.
చంద్రబాబు పాలన.. మోసం గ్యారంటీ..
- ఇన్‌పుట్ సబ్సిడీకి చంద్రబాబు మంగళం పాడారు.
- ఉచిత పంటల బీమా కింద రూ.3500 కోట్ల బకాయిలు పెట్టారు.
- రైతులకు చేసిన మోసాలే.. బాబు గ్యారంటీలుగా కనిపిస్తున్నాయి.
- వరుసగా రెండో ఏడాది పొగాకు ధరలు పడిపోయాయి.
- మా హయాంలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేవాళ్లం.
- పొగాకు రైతులకు మా హయాంలో భరోసా ఉండేది.
- రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు సమస్యలే కనిపిస్తున్నాయి.
- రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.
- రైతుల సమస్యలు చంద్రబాబుకు పట్టవు.
- రైతుల ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే.
- మా హయాంలో మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాం.
- ఆర్బీకే పరిధిలోనే రైతులు సమస్యలను పరిష్కరించే వాళ్లం.
- మా హయాంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఉండేది.
- ఉచిత పంటల బీమా పూర్తిగా రద్దు చేశారు.
- పొగాకు రైతులను ఆదుకున్నామని ఎల్లో మీడియాలో ఊదరగొట్టారు.
- రాష్ట్ర పాలనను చంద్రబాబు గాలికొదిలేశారు.
- చంద్రబాబు చేసేది అవినీతి, దోపిడీ, రెడ్‌బుక్
- రాష్ట్రంలో ఆక్వా రంగం కుదేలైంది.
- మేము ఆక్వా రంగంలో చట్టం తెచ్చి రైతులను ఆదుకున్నాం.
- అసలు చంద్రబాబు పాలన చేస్తున్నాడా? లేదా?:
- మా ప్రభుత్వం ఒక చట్టంచేసి, సీఎం ఛైర్మన్‌గా “APSADA అప్సడా’ ఏర్పాటు చేస్తే ఫీడు, సీడుసహా, ఆక్వా కొనుగోలు ధరలను రెగ్యులేట్ చేశాం
- అలాంటిది అప్సడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే,
- చట్టాన్ని బేఖాతరు చేస్తూ కంపెనీలన్నీ కూడా కార్టెల్ కింద తయారయ్యాయి.
- ఏప్రిల్ ఒక దఫా, జూన్‌లో మరో దఫా మొత్తం కిలోకు ఫీడ్ ధర రూ.14 -16ల వరకూ ధరలు పెంచారు.
- మరోవైపు ఈ కార్టెల్ సిండికేట్ వల్ల, ఫీడ్ ధరలు ఓవైపు, మరోవైపు రేట్లు చూస్తే,
- పంట చేతికి వచ్చే సమయానికి రేట్లు క్రాష్ చేస్తున్నారు. 100 కౌంట్ రొయ్యలు రూ.270 నుంచి రూ.220- 240 మధ్య పడిపోయాయి.
- రైతుల తీవ్ర ఆందోళనలు, వారికి మద్దతుగా పోరాటాలు చేస్తామన్న మన పార్టీ నుంచి హెచ్చరికల నేపథ్యంలో
- కిలోకు రూ.4లు తగ్గిస్తామంటూ హడావిడి చేశారు.
- తన ఎల్లోమీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నాడు.
- తీరాచూస్తే తగ్గింది కేవలం రూ.2లు.
- వాళ్లు పెంచింది రూ.14-16లు.
- తగ్గింది కేవలం రూ.2లు. పెంచింది ఎక్కడ? తగ్గించింది ఎక్కడ?.
మామిడి రైతులకు అన్యాయం..
- గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభం మన కళ్లముందే చూశాం.
- పంట అంతా అయిపోయాక చివర్లో రైతులకు కిలోకు రూ.12లు ఇస్తామన్నారు.
- రూ.4లు రాష్ట్ర ప్రభుత్వం, రూ.8లు కంపెనీలు.
- కానీ ఏ కంపెనీ కూడా రూ.8లు రేటు ఇవ్వలేదు.
- రూ.4-5లతో సరిపెట్టాయి.
- ఇవ్వాళ్టికీ రైతులకు పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయలేదు.
- రైతులు రోడ్డెక్కడంతోపాటు, వారికి మద్దతుగా నేను కూడా బంగారుపాళ్యం వెళ్లి, అక్కడ పరిస్థితులను స్వయంగా చూశాను
- మళ్లీ ఈ ఏడాది అదే పరిస్థితి కనిపిస్తోంది:
- ఒక కిలో మామిడికి రైతులు పెట్టే పెట్టుబడి సుమారు రూ.15లు అయితే,
- ఇవాళ తోతాపురి మామిడిని దారుణంగా కిలో సుమారుగా రూ.5లకు కొనుగోలు చేస్తున్నారు.
- ధరలు పతనం కావడంతో పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం గత ఏడాదిలానే
- ఈ ఏడాది కూడా రైతులకు మేలు చేసేలా కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంది.
- 1.3లక్షల టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు కిలో రూ.17.50ల చొప్పున ధర నిర్ణయిస్తూ,
- MIS కింద, PDPS కింద కొనుగోలుకు కేంద్రం ముందుకు వచ్చింది.
- కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, కేంద్ర మంత్రి కుమార స్వామి జూన్ 24న లేఖరాస్తే,
- జూన్ 25న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నుంచి మామిడి కొనుగోలుకు సానుకూల స్పందన వచ్చింది.
- మరి చంద్రబాబు ముందుగా ఆపని ఎందుకు చేయలేదు?
- మన రాష్ట్రంలో కూడా మామిడి రైతులకు ధర రావడం లేదని చంద్రబాబుకు తెలుసు. అయినా నిద్ర లేవలేదు.
- కుమారస్వామి పార్టీలానే ఈయనా కేంద్రంలో భాగస్వామి. ఈయనకీ కేంద్రంలో మంత్రులున్నారు.
- అక్కడ కుమారస్వామి జూన్ 24 లేఖరాసిన తర్వాత, కేంద్రం స్పందించడం, ఇది మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రావడం జరిగింది.
- చంద్రబాబు తీరిగ్గా జూన్ 28న లేఖ రాశారు.
- ఇది రాష్ట్రంలో రైతుల మీద చంద్రబాబుకు ఉన్న ధ్యాస.
- ఆ రాసిన లేఖలో కూడా రైతులకు మేలుచేసే దిశగా దృష్టిపెట్టలేదు.
- కర్ణాటకలో రైతునుంచి కొనుగోలు చేసే మామిడికి కేంద్ర ప్రభుత్వం కిలోకు రూ.17.50లు నిర్ణయిస్తే,
- ఆ ధర ఇక్కడ కూడా ఇవ్వమని అడగకపోగా, కిలోకు రూ.4లు ఇస్తామని, ఆడబ్బు కేంద్రం నుంచి ఇవ్వాలంటూ మాత్రమే రాశాడు.
- చంద్రబాబు తన వారైన గల్లాఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వీరికే న్యాయం జరగాలి అన్నట్టుగా వ్యవహరిస్తాడు.
SIR పేరుతో ఓట్ల తొలగింపు..
- బీచ్‌లను కూడా చంద్రబాబు వదలడం లేదు.
- బీచ్ షాక్స్ పేరుతో మద్యం అమ్ముతారా?.
- బీచ్‌లకు కుటుంబం అంతా కలిసి వెళ్లగలరా?.
- ఎస్‌ఐఆర్ పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్టు తొలగించే కుట్ర జరుగుతోంది.
- ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా ఇచ్చేసినట్టు రాస్తున్నారు.
- చంద్రబాబుకు మానవతం ఉందా?.
- స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటు తొలగిస్తారా?.
- పేదవాడి ఓట్లు తొలగిస్తే సంక్షేమ పథకాలు ఎలా వస్తాయి?.
- సిటిజన్‌షిప్ లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు.
- ఈఆర్‌వో హోదాలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ అధికార దుర్వినియోగం.
- ఓట్ల తొలగింపుపై అధికారులతో మంత్రులు మాట్లాడుతున్నారు.
హే రామ్.. సేవ్ ఆంధ్రా..
- కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారు.
- బడుగు, బలహీనవర్గాలను కించపరిస్తే సీఎం ఏం చేస్తున్నారు??
- రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
- దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలా? లేదా?.
- రిజర్వేషన్లపై బాలకృష్ణన్ కమిటీ అధ్యయనం చేస్తుంది.
- మతం, రిజర్వేషన్‌కు ముడిపెట్టడం సరికాదని తీర్మానం చేశాం.
- స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటు తొలగిస్తారా?.
- రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి.
- హే రామ్.. సేవ్ ఆంధ్రా..
- బాలకృష్ణన్ కమిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చాం.
- దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై చంద్రబాబు స్టాండ్ ఏంటి?.
- బాబూ.. చేతనైతే మంచి చెయ్.. విద్వేషాలు రెచ్చగొట్టొద్దు.



