Olympics 2024: మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌లకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Congratulates To Manubhaker Sarabjot Singh Pair Won Medal In Olympics | Sakshi
Sakshi News home page

Olympics 2024: మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌లకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Jul 30 2024 4:22 PM | Updated on Jul 30 2024 5:50 PM

YS Jagan Congratulates To Manubhaker Sarabjot Singh Pair Won Medal In Olympics

పారిస్‌  ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో పతకం సాధించిన భారత ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ జోడీ మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌లను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.

‘ఒలింపిక్స్‌ ఎయిర్‌   పిస్టల్‌ 10   మీటర్ల మిక్స్‌డ్‌ ఈవెంట్‌ లో మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌లు  కాంస్యం గెలిచి  భారతదేశ కీర్తిని మరింత పెంచారు’ అంటూ  వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

కాగా, ఒలింపిక్స్‌-2024లో భారత్‌ రెండో పతకం సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్‌ జోడీ మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్‌ మెడల్‌ అందించారు.

దక్షిణ కొరియా జోడీ(జిన్‌ ఓయె–లీ వన్‌హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్‌ తరఫున ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement