చిరుత దాడిలో మహిళ మృతి.. | Woman Dies On Leopard Attack On Kurnool | Sakshi
Sakshi News home page

చిరుత దాడిలో మహిళ మృతి..

Jun 25 2024 8:14 PM | Updated on Jun 25 2024 9:05 PM

Woman Dies On Leopard Attack On Kurnool

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం పచర్లలో దారుణం జరిగింది. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా మృతి చెందింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన షేక్ మెహరున్నిసాపై చిరుత దాడి చేసింది. తలను తినేసింది. మొండాన్ని వదిలేసింది. అయితే కట్టెల కోసం వెళ్లిన మెహరున్నిసా రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో మెహరున్నిసా మొండెం లభ్యం కావడంతో  హతాశులయ్యారు.  

స్థానికులు సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు , 2 బొన్లు  ఏర్పాటు చేశారు. చిరుత కోసం అన్వేషణ ప్రారంభించారు. కాగా, నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement