నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా! | A Video Of Two Women In Eluru Goes Viral | Sakshi
Sakshi News home page

నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా!

Jun 17 2025 12:02 PM | Updated on Jun 17 2025 3:16 PM

A Video Of Two Women In Eluru Goes Viral

ఏలూరు టౌన్‌: తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందేమోననే అనుమానంతో ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి మరో మహిళను నడిరోడ్డుపై జట్టుపట్టుకుని లాగి దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 

ఏలూరు రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న బొల్లె సుజాత ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె కళాశాలలో చదువుకునే సమయంలో మెరుగు నాని అనే వ్యక్తితో ప్రేమ వ్యవ హారం నడించింది. అయితే వీరి వివా హానికి పెద్దలు నిరాకరించడంతో వీరిద్దరూ వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. అనంతరం నానికి ప్రభుత్వ మహిళా ఉద్యోగి జయశ్రీతో వివాహమైంది. 

ఈ నేపథ్యంలో సుజాత అనే మహిళతో నానికి వివాహేతర సంబంధం కొనసాగుతుందని కొందరు చెప్పడంతో జయశ్రీ అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో గత శనివారం సాయంత్రం సుజాత తారసపడడంతో జయశ్రీ దాడికి పాల్పడింది. అటుగా వెళుతున్న పోలీస్‌ సిబ్బంది వారించినా ఆమె వినకుండా దాడి చేసింది. బాధిత మహిళ సుజాత సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో తనపై దాడిని పేర్కొంటూ ప్రాణహాని ఉందనీ, రక్షణ కల్పించాలని కోరుతూ ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement