వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి | Vaikunta Dwara Darshanam Arrangements Completed | Sakshi
Sakshi News home page

వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

Dec 22 2020 4:33 PM | Updated on Dec 22 2020 4:39 PM

Vaikunta Dwara Darshanam Arrangements Completed - Sakshi

సాక్షి, తిరుమల: వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఐదు సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేంద్రాలను అడిషనల్‌ ఈవోతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఎల్లుండి నుంచి భక్తులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో స్థానికులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. బయట ప్రాంతాల నుంచి రావొద్దని భక్తులకు జవహర్‌రెడ్డి  విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు)

Advertisement
 
Advertisement
Advertisement